S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/18/2016 - 18:10

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఎప్పటిలా భారత్ తమపై నిందలు వేసిందని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆత్మాహుతి దాడి అనంతరం ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉటంకిస్తూ కుట్రదారులను శిక్షిస్తామని చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా తాము ఖండిస్తూనే ఉంటామని పేర్కొంది.

09/18/2016 - 18:10

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. యూరీ సెక్టార్, ఎల్‌ఒసి వద్ద మార్గాలను మూసివేశారు. యూరీ సెక్టార్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన సైనిక స్థావరంవద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

09/18/2016 - 18:09

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో సైనిక స్థావరంపై దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగానే పౌరులుకూడా పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పాక్ వైఖరిని తూర్పారపడుతూ భారత్ తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో స్పందించారు. సైనికులపై ఆత్మాహుతి దాడి, జవాన్ల వీరమరణం వార్త విని తన గుండె పగిలిందని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

09/18/2016 - 17:26

శ్రీనగర్:సైనిక శిబిరంపై దాడికి పాల్పడి పెద్దఎత్తున సైనికులను హతమార్చడం ద్వారా జమ్మూకాశ్మీర్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించాలన్న కుట్ర ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ ఆటలో కాశ్మీర్ ప్రజలు ఆరు దశాబ్దాలుగా భారీ మూల్యమే చెల్లిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

09/18/2016 - 17:25

శ్రీనగర్:యూరి సెక్టర్‌లోని సైనిక స్థావరంపై ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన నలుగురు తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేఇ మహమ్మద్ (జెఇఎమ్)కు చెందినవారేనని ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడినది కూడా ఈ సంస్థకు చెందిన తీవ్రవాదులే కావడం గమనార్హం.

09/18/2016 - 16:03

న్యూఢిల్లి:జమ్ముకాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో సైనిక స్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడిని పిరికిపందల చర్యగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ఆయన నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ దాడి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని, ఇది క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితిపై ఆయన హోంమంత్రితో మాట్లాడారు.

09/18/2016 - 16:02

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో సైనికస్థావరంపై ఆత్మాహుతి దాడి జరిగిన నేపథ్యంలో తన రష్యా పర్యటనను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రక్షణమంత్రి పారికర్, ఇతర అధికారులతో ఆయన సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించారు. దాడి సంఘటనపై ప్రధానికి వివరించారు. తక్షణం కాశ్మీర్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంతనాలు జరిపారు.

09/18/2016 - 16:01

న్యూఢిల్లి:శ్రీనగర్‌లోని యూరి సెక్టర్‌లో సైనిక స్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడి గతంలో జరిగిన పఠాన్‌కోట్ దాడి తరహాలోనే ఉంది. అప్పుడు, ఇప్పుడు ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందని బలమైన ఆధారాలు దొరికాయి. 2002 తరువాత ఇంత పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించకపోవడం గమనార్హం.

09/18/2016 - 16:00

శ్రీనగర్:తమకు మద్దతు ఇస్తున్న భారత్‌పై అతి త్వరలో పాకిస్తాన్ దాడులకు పురిగొల్పుతుందని, అందుకు తగ్గ సమాచారం తమ వద్ద ఉందని బలూచిస్తాన్ ఉద్యమ నాయకులు భారత్‌ను రెండు రోజుల క్రితం హెచ్చరించారు. వారు చెప్పినట్లే దాడి జరిగింది. బలూచిస్తాన్ ఉద్యమకారులకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ మద్దతు ప్రకటించినప్పటినుంచి రగిలిపోతున్న పాక్ ఈపనికి పాల్పడింది.

09/18/2016 - 16:00

శ్రీనగర్:సైనికస్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడానికి కారణాలు తెలిసాయి. తెల్లవారుజామున మంచి నిద్రలో సైనికులు ఉండటం, ఆరు బటయ టెంట్లలో వారు నిద్రించడం, గ్రనేడ్ల దాడిలో మంటలు అంటుకుని టెంట్లు కాలిపోవడం, సైనికులు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో వారు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు.

Pages