S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/04/2017 - 01:15

న్యూఢిల్లీ, జూలై 3: డ్రాగన్ బుసకొడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. భారత్‌ను రెచ్చగొడుతోంది. భారతదేశమే హద్దులు మీరి తనకు ద్రోహం చేస్తోందని సరికొత్త వాదన చేస్తోంది. తమది 1962నాటి భారత్ కాదని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేస్తే తమదీ 1962 నాటి చైనా కాదని తిప్పికొట్టింది.

07/04/2017 - 00:34

న్యూఢిల్లీ, జూలై 3: శిశువు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గర్భస్రావం చేయించుకోడానికి ఓ మహిళకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. కడుపులో ఉన్న 26 వారాల బిడ్డ గుండె సంబంధిత సమస్యతో ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఒకవేళ శిశువు జన్మించినా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటుందని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి స్పష్టం చేసింది. దీనిపై ఆసుపత్రి మెడికల్ బోర్డు నివేదికను అందించింది.

07/04/2017 - 00:33

అహ్మదాబాద్, జూలై 3: దేని దశ ఎప్పుడు ఎలాతిరుగుతుందో ఎవరూ చెప్పలేం. వ్యక్తి కావచ్చు లేదా సంస్థ కావచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ అమ్మిన స్టాల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. ఆ టీ స్టాల్‌ని టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని వాద్‌నగర్ స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఉన్న చిన్న టీ స్టాల్‌లో నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ అమ్మేవారు.

07/04/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 3: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజ్యసభలో మద్దతు పెరగనుంది. ఆరుగురు ఇండిపెండెంట్ సభ్యులు కోవింద్‌కే ఓటు వేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వారిలో కొందరు పలు అంశాలపై ఎన్‌డిఏకు మద్దతు ఇస్తున్నారు.

07/04/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 3: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) ట్యాంపరింగ్ అయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.

07/04/2017 - 00:29

న్యూఢిల్లీ,జున్ 3: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటిలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ విచారించింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలైనందు వల్ల

07/03/2017 - 02:58

న్యూఢిల్లీ, జూలై 2: గత శుక్రవారం అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాలులో గంటకు పైగా అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భారత్ ఒక కొత్త ఆర్థిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా వస్తు, సేవలకు ఒకే పన్ను కలిగిన ఏడవ దేశంగా అవతరించిన విషయం తెలిసిందే.

07/03/2017 - 02:56

న్యూఢిల్లీ, జూలై 2: రాబోయే రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు అనుకూలంగా ప్రతిపక్షాల సభ్యులనుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బిజెపి ఆశిస్తోంది.

07/03/2017 - 02:54

లక్నో, జూలై 2: యాంగ్రీ యంగ్ కాప్ శ్రేష్ఠా ఠాకూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వారం రోజుల క్రితం బులంద్‌షహర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న బిజెపి స్థానిక కార్యకర్తకు ఫైన్ వేసిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు నినాదాలు చేయడంతో వారితో వాగ్వాదానికి దిగి, వారిపై చర్యతీసుకున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠా ఠాకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

07/03/2017 - 02:51

లక్నో, జూలై 2: వచ్చే వారం గురుపూర్ణిమ తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణంకోసం యత్నాలు ఊపందుకోనున్నాయి. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఉన్న నారదానంద ఆశ్రమంలో గురుపూర్ణిమ రోజున పెద్దఎత్తున సాధువులు, సన్యాసులు సమావేశమవుతున్నారు.

Pages