S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/25/2017 - 01:58

న్యూఢిల్లీ, జూలై 24: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ తాను, తన కుటుంబ సభ్యులపై చేసిన నాలుగు ఆరోపణలను బిజెపి ఉపరాష్టప్రతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

07/25/2017 - 01:56

బెంగళూరు, జూలై 24: అంతరిక్ష ప్రయోగాలలో భారత్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన మార్గదర్శి, దార్శనికుడు ఉడిపి రామచంద్రారావు (యుఆర్‌రావు). ప్రపంచ దేశాల సరసన అంతరిక్ష పరిశోధనల్లో మనదేశం సగర్వంగా తలెత్తుకు నిలిచేలా చేసిన ఘనత యుఆర్‌రావుకే దక్కుతుంది. అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా తనకంటూ ఓ ప్రత్యేకతను యుఆర్‌రావు చాటుకున్నారు.

07/25/2017 - 01:54

ఔరంగాబాద్/నలంద, జూలై 24: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం డబ్బులు సమకూర్చుకోలేకపోతే భార్యను అమ్ముకోవాలంటూ బిహార్‌లో ఒక జిల్లా కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమహోర్ బ్లాక్‌లో గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వచ్ఛత మహాసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ కన్వల్ తనుజ్ అక్కడి గ్రామస్థులతో మాట్లాడారు.

07/25/2017 - 01:53

కాన్పూర్, జూలై 24: భారత కొత్త రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న సందర్భంగా ఆయన చదువుకున్న కాలేజీలో పండుగ వాతావరణం నెలకొంది. 14వ రాష్టప్రతిగా మంగళవారం కోవింద్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో కోవింద్ చదువుకున్న ఇంటర్ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

07/25/2017 - 01:12

న్యూఢిల్లీ, జూలై 24: భారత 14వ రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖేహర్ ఆయన చేత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మధ్యాహ్నం గం.12.15కు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రభృతులు హాజరవుతారు.

07/25/2017 - 01:02

న్యూఢిల్లీ, జూలై 24: లోక్‌సభలో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్, సభనుంచి సస్పెండ్ చేశారు. జీరో అవర్‌లో పేపర్లు చింపి స్పీకర్‌పై విసరటం సభా నియమాలను ఉల్లంఘించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/25/2017 - 19:20

బెంగళూరు: ప్రఖ్యాత శాస్తవ్రేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ ఉడిపి రామచంద్రరావు(85) సోమవారం కన్నుమూశారు. ఇక్కడి తన స్వగృహంలో తెల్లవారుజామున 3 గంటలకు రామచంద్రరావు తుదిశ్వాస విడిచారు. కర్నాటకలోని ఉడిపి జిల్లా అడమారుకు చెందిన రామచంద్రరావు ఇస్రోకు వివిధ హోదాల్లో చివరివరకు సేవలందించారు. ఇస్రో చైర్మన్‌గా 1984 నుంచి 1994 వరకు సేవలందించారు.

07/25/2017 - 00:58

న్యూఢిల్లీ, జూలై 24: పోలవరం ప్రాజెక్టును సమర్థంగా, త్వరితగతిన పూర్తి చేసేందుకే నిర్మాణ పనులను రాష్ట్రానికే అప్పగించాం. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాలేదు. మరో 15, 20 రోజుల్లో వెయ్యి కోట్లు కేంద్రం విడుదల చేయనుంది’ అని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో ప్రకటించారు.

07/25/2017 - 00:55

న్యూఢిల్లీ, జూలై 24: భిన్న భావనలతో కూడిన చర్చలను శాంతియుతంగా సంయమనంతో నిర్వహించాల్సిన అవసరం ఉందని, వౌఖికంగా కానీ, శారీరకంగా కానీ హింసాత్మక ధోరణులు ఎంతమాత్రం తగవని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. భారత రాష్టప్రతిగా సోమవారం జాతినుద్దేశించి చివరిసారిగా ప్రసంగించిన ఆయన ‘‘్భరత దేశ శక్తి దాని సహనశీలతలోనే ఉంది’’ అని ఉద్ఘాటించారు.

07/24/2017 - 02:46

పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆదివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సమావేశం ఘనంగా జరిగింది. అధికార, విపక్ష సభ్యులు లందరూ హాజరైన ఈ సమావేశం ఆహ్లాదకరంగా ముగిసింది. ప్రణబ్‌ను తోడ్కొని వస్తున్న ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్.

Pages