S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/24/2017 - 01:42

న్యూఢిల్లీ, జూలై 23: అత్యంత సంక్లిష్టమైన హిమాలయాల్లోని మారుమూల మంచు పర్వతాలు, థార్ ఎడారి, దుర్గమమైన ఈశాన్య రాష్ట్రాలు.. ఇలా సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉండే జవాన్లకు పైపుల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ సహకారంతో హోం శాఖ ఈ ప్రణాళికను అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.6వేల కోట్లు అవసరమవుతాయని అంచనా.

07/24/2017 - 01:41

న్యూఢిల్లీ, జూలై 23: బిజెపి విస్తరణ అజెండాలో అగ్రభాగాన ఉన్న పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో రాష్టప్రతి ఎన్నికల్లో ఓటింగ్ తీరు ఆ పార్టీ వ్యూహకర్తలకు ఆనందాన్ని కలిగిస్తోంది. బెంగాల్‌లో బిజెపికి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.

07/24/2017 - 01:40

తిరువనంతపురం, జూలై 23: కేరళలో అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం వినె్సంట్‌ను పార్టీ పదవినుంచి రాష్ట్ర కాంగ్రెస్ తొలగించింది. వినె్సంట్‌పై అత్యాచారం కేసు, ఆయన అరెస్టు రెండూ కూడా రాజకీయ దురుద్దేశంతో జరిపినవే అయినప్పటికీ మహిళ ఫిర్యాదు దృష్ట్యా ఆయనను పార్టీ కార్యదర్శి పదవినుంచి తొలగించాలని నిర్ణయించినట్లు కేరళ పిసిసి అధ్యక్షుడు ఎంఎం హసన్ ఆదివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు.

07/24/2017 - 01:40

జైపూర్, జూలై 23: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్‌లో తన మూడు రోజుల పర్యటన చివరి రోజయిన ఆదివారంనాడు జైపూర్‌లో ఒక దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో పలు సమావేవాలు జరిపిన అనంతరం షా నగరంలోని సుశీల్‌పుర ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య బిజెపి యువమోర్చా సభ్యుడు రమేశ్ పచరియ ఇంట్లో భోజనం చేశారు.

07/24/2017 - 01:38

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ్భారత్-స్వస్థ్ భారత్’ పథకానికి తనవంతు ప్రచారం చేస్తున్నాడు ఓ భారతీయుడు. ఒంటినిండా పోస్టర్లు కప్పుకుని సైకిల్‌పై ఇలా తిరుగుతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆదివారంనాడు కనిపించిన దృశ్యమిది

07/24/2017 - 01:36

న్యూఢిల్లీ, జూలై 23: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రణబ్ ముఖర్జీల మధ్య మాటలకందని సాన్నిహిత్యం ఉండేది. అది ఎంత సాన్నిహిత్యం అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్నయినా ప్రణబ్ చెప్పకూడదని అనుకుంటే ఆయననుంచి దాన్ని రాబట్టడం ఎంతటి వారికయినా అసాధ్యమని ఇందిరాగాంధీ గట్టిగా నమ్మే వారు. ‘ఎవరెంతగా ప్రయత్నించినా ప్రణబ్‌నుంచి ఒక్క మాట కూడా బైటికి రాదు.

07/24/2017 - 01:32

న్యూఢిల్లీ, జూలై 23: రాష్టప్రతిగా సోమవారం బాధ్యతలనుంచి తప్పుకోనున్న ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం చెప్పడానికి రాజాజీ మార్గ్‌లోని ఓ చరిత్రాత్మక భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. గతంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ఉన్న ఇంటినే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీకి కేటాయించారు. సువిశాలమైన రాష్టప్రతి భవన్‌ను వదిలిపెట్టిన తర్వాత ప్రణబ్ రాజాజి మార్గ్‌లోని ఓ పాతకాలం నాటి విశాలమైన భవనంలోకి మారనున్నారు.

07/24/2017 - 01:11

న్యూఢిల్లీ, జూలై 23: ట్రాన్స్‌జండర్లకు వివాహం, విడాకులు తదితర హక్కులపై ఏర్పాటు చేసిన ప్రభుత్వ ట్రాన్స్‌జండర్ల రక్షణ, హక్కుల కల్పన ముసాయిదా బిల్లులో ఎన్నో లోపాలున్నాయని బిజెపి లోక్‌సభ సభ్యుడు రమేష్ బాయిస్ నేతృత్వంలోని ప్యానల్ విమర్శించింది. ట్రాన్స్‌జండర్లకు హక్కులు, సామాజిక న్యాయం, సాధికారతపై వేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది.

07/24/2017 - 01:10

న్యూఢిల్లీ, జూలై 23: మురికి దుప్పట్లు, ఉతకని తువాళ్లు, శుభ్రం చేయని తలదిండు కవర్లు.. ఇదీ రైల్వేశాఖ ప్రయాణికులకు అందజేస్తున్న సౌకర్యాల తీరు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల తీరుపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన అధ్యయనంలో వెలుగుచూసిన నిజాలు ఇవి. వీటి శుభ్రతపై రైల్వే శాఖలో పేరుకు పోయిన నిర్లక్ష్యాన్ని కాగ్ తన నివేదికలో ఉతికి ఆరేసింది.

07/24/2017 - 00:46

న్యూఢిల్లీ, జూలై 23: పొరుగు దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుందని ఎన్డీయే ఉపరాష్టప్రతి అభ్యర్థి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ప్రతి ఏటా కార్గిల్ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న కార్గిల్ పరాక్రమ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని పాకిస్తాన్‌కి ఆయన హితువు పలికారు.

Pages