S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/23/2017 - 01:52

జైపూర్, జూలై 22: అయోధ్యలో రామమందిరాన్ని పరస్పర చర్చల తర్వాత చట్టబద్ధంగా నిర్మించాలని తమ పార్టీ కోరుకుంటోందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ‘ఈ విషయంలో మా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉండడమే కాకుండా గత నాలుగు లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలలోను పేర్కొనడం జరిగింది.

07/23/2017 - 01:30

చిత్రం.. ఈ నెల 25న కొత్త రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లలో భాగంగా శనివారంనాడు ఢిల్లీలోని రైజినా హిల్స్‌లో జరిగిన ఫుల్‌డ్రెస్స్‌డ్ రిహార్సల్స్

07/23/2017 - 01:27

న్యూఢిల్లీ, జూలై 22: రాష్టప్రతి ప్రణ బ్ ముఖర్జీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ హౌస్‌లో శనివా రం వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్టప్రతి పదవికి కొత్తగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రణబ్ ముఖర్జీకి ఈ సందర్భంగా మెమొంటోను అందించి సత్కరించా రు.

07/22/2017 - 02:21

గాంధీనగర్, జూలై 21: త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలంగా పార్టీపట్ల అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు శంకర్ సింఘ్ వాఘేలా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బిజెపిలో లేదా మరే ఇతర పార్టీలోను చేరే ఉద్దేశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

07/22/2017 - 02:19

న్యూఢిల్లీ, జూలై 21: డోక్లామ్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్‌లో ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, డోక్లామ్ సమస్యపై అర్థవంతమైన సంప్రదింపులు జరిగేందుకు రెండు దేశాల సైన్యాలు అక్కడినుండి ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించటం తెలిసిందే.

07/22/2017 - 02:17

న్యూఢిల్లీ, జూలై 21: లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్తంభింపజేసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షం శుక్రవారం చేసిన ప్రయత్నాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ వమ్ము చేశారు. ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ పెద్దఎత్తున గొడవ చేశారు.

07/22/2017 - 02:15

కోహిమా, జూలై 21: నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జెలియాంగ్ శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. రాష్ట్ర గవర్నర్ పి.బి.ఆచార్య తనను ముఖ్యమంత్రిగా నియమించిన రెండు రోజుల్లోనే జెలియాంగ్ అసెంబ్లీలో తన మెజార్టీ నిరూపించుకోవడం గమనార్హం. 59మంది సభ్యులుగల రాష్ట్ర అసెంబ్లీలో 47మంది ఎమ్మెల్యేలు జెలియాంగ్‌కు మద్దతు పలికారు.

07/22/2017 - 02:14

న్యూఢిల్లీ, జూలై 21: అంతర్జాతీయంగా వివిధ సంస్థలు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఆదాయం పన్ను శాఖ రూ.19,000 కోట్ల నల్లధనాన్ని గుర్తించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు చెప్పారు. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిజెఐ) దాదాపు 700 మంది భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించిన వివరాలను వెల్లడించిందని జైట్లీ తెలిపారు.

07/22/2017 - 02:11

కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన సంస్మరణ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భారీగా తరలివచ్చిన జనం. 1993లో పోలీసు కాల్పుల్లో 13 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మృతిచెందారు. వారి స్మృత్యర్థం ప్రతి ఏటా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు

07/22/2017 - 02:07

న్యూఢిల్లీ, జూలై 21: ఉపాధ్యాయులు తమ అర్హతలను పెంచుకునేందుకు విధించిన గడువును నాలుగేళ్లకు పెంచటం వలన దేశంలోని లక్షలాది మంది ఉపాధ్యాయులకు ఎంతోమేలు జరుగుతుందని తెలుగుదేశం సభ్యుడు జయదేవ్ గల్లా అభిప్రాయపడ్డారు.

Pages