S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2017 - 00:59

రిలయెన్స్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. జియో సిమ్‌లతో దేశ ప్రజల్ని విశేషంగా ఆకర్షించిన ముఖేష్ అంబానీ జన సామాన్యానికి అందుబాటులో ఉండేలా 4జి ఫీచర్ ఫోన్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఊతాన్నిచ్చే రీతిలో భారతీయులే రూపొందించిన సామాన్యుడి ఫోన్ వాయిస్ కమాండ్‌తో పని చేస్తుంది. జీవితకాల ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు అపరిమితమైన డేటాను అందిస్తుంది.

07/22/2017 - 00:57

న్యూఢిల్లీ, జూలై 21: గో సంరక్షణ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవాళ్లను సమర్థించొద్దని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అంతేకాదు గో సంక్షరణ పేరిట సాగుతోన్న హింసాత్మక ఘటనలపై వైఖరేమిటో చెప్పాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాలను కోరింది.

07/21/2017 - 03:30

చిత్రం.. రాష్టప్రతిగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకుంటున్న కోవింద్
శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోదీ

07/21/2017 - 02:31

చిత్రం.. రాష్టప్రతిగా ఎన్నికైన కోవింద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోదీ

07/21/2017 - 02:27

చిత్రాలు.. కోవింద్ గెలుపుతో ఆనందంతో స్వీట్లు పంచుకుంటున్న బిజెపి మహిళా కార్యకర్తలు, బాణసంచా కాలుస్తున్న అభిమానులు

07/21/2017 - 02:24

న్యూఢిల్లీ,జూలై 20: రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది శాసన సభ్యులుంటే భూమానాగిరెడ్డి మరణణ వలన ఒక ఖాళీ ఏర్పడింది. దీనితో ఏపిలో మొత్తం ఓట్ల సంఖ్య 174కాగా, ఇందులో నుండి రామ్‌నాథ్ కోవింద్‌కు 171 ఓట్లు పడ్డాయి. వీటి మొత్తం వీలువ 27,189. నాలుగు వందల డెబ్బై ఏడు విలువ ఉన్న మూడు ఓట్లు చెల్లకుండాపోయాయి.

07/21/2017 - 02:24

న్యూఢిల్లీ, జూలై 20: భారత నూతన రాష్టప్రతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 771 మంది ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్సులు కాగా, ఈ నెల 17న జరిగిన ఓటింగ్‌లో 768 మంది ఎంపీలు ఓటు వేశారు. కాగా, మొత్తం 4,109 మంది ఎమ్మెల్యేల్లో 4,083 మంది ఓట్లు వేశారు.

07/21/2017 - 02:23

న్యూఢిల్లీ, జూలై 20: సాధారణంగా ఎన్నికల్లో ఓటరు అజ్ఞానం కారణంగానో, లేదా చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఓట్లు చెల్లక పోవడం సహజంగా జరుగుతూ ఉం టుంది. అయితే లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు వేసే ఓటు కూడా చెల్లలేదంటే ఏమనుకోవాలి? తాజాగా జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం 77 ఓట్లు చెల్లకపోగా, అందులో 21 ఓట్లు ఎంపిలవే కావడం గమనార్హం.

07/21/2017 - 02:23

న్యూఢిల్లీ, జూలై 20: కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు గురువారం కూడా రైతుల సమస్యలపై లోక్‌సభను స్తంభింపజేశారు. ‘సభ సజావుగా జరగడం మీకు ఇష్టం లేదు, చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెబుతున్నా మీరు మాత్రం సభను స్తంభింపజేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చురకలు అంటించారు.

07/21/2017 - 02:19

న్యూఢిల్లీ, జూలై 20: దేశ 14వ రాష్టప్రతి ఎన్నిక ప్రక్రి య తుది దశకు చేరుకొని రామ్‌నాథ్ కోవింద్ కొత్త అధ్యక్షుడిగా రాష్టప్రతి భవన్‌లో అడుగుపెట్టనున్న తరుణంలో రాష్టప్రతి అధికార నివాసమైన రాష్టప్రతి భవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను గుర్తు చేసుకోవడం ఎంతో సముచితంగా ఉంటుంది. న్యూఢిల్లీలో ఉన్న రాష్టప్రతి భవన్ దేశంలో అత్యంత కళాత్మక కట్టడాల్లో ఒకటని చెప్పవచ్చు.

Pages