S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/10/2016 - 03:11

శంకర్‌పల్లి, డిసెంబర్ 9: శంకర్‌పల్లి మండల పరిధిలోని రావులపల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టా విరిగిన సంఘటనలో శక్రవారం ఉదయం షిర్డీ నుండి కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, శంకర్‌పల్లి స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/10/2016 - 02:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: విద్య, వ్యవసాయం, గనులు, సాంకేతికత తదితర రంగాల్లో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది.

12/10/2016 - 02:35

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఏపిలో కృషి విజ్ఞాన కేంద్రాలు 23 ఉన్నాయని, అందులో 17 వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 1991 మంజూరు చేసిన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం 2012 నుంచి పనిచేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు.

12/10/2016 - 02:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై గొడవ చల్లారకముందే త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించనున్నట్లు కేంద్రం తెలియజేసింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సేకరించడం కూడా ప్రారంభమయిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేవారు.

12/10/2016 - 02:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణలో ఖాళీగావున్న మూడు వర్శిటీల వైస్ చాన్స్‌లర్ల నియామకానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విసిల నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

12/10/2016 - 02:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలోని ప్రముఖుల (వివిఐపిల) కోసం 3,600 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శుక్రవారం భారత వైమానికదళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పి.త్యాగీని అరెస్టు చేసింది.

12/10/2016 - 01:56

న్యూఢిల్లీ, డిసెంబరు 9: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీఒ) అధ్వర్వంలో మచిలీపట్నం వద్ద క్షిపణి పరీక్ష కేంద్రంతోపాటు లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ ప్రతిపాదనను ఎపీ ప్రభుత్వానికి పంపినట్టు తెలిపింది.

12/10/2016 - 01:54

తిరుపతి/చెన్నై, డిసెంబర్ 9: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నాయకుడు, పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్ళలో శుక్రవారం రెండో రోజు కూడా ఎసిబి అధికారులు తనిఖీలు

12/10/2016 - 02:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్యాకేజీకి వీలున్నంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిసింది. ఆయన శుక్రవారం జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతోపాటు ఇతర ప్రాజెక్టుల అమలు గురించి చర్చించారు.

12/10/2016 - 01:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలో కరెన్సీ కొరత హాహాకారాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర ధోరణిపై సుప్రీం కోర్టు నిప్పులు చెరిగింది. ఏ ఉద్దేశంతో కరెన్సీని ఉన్నపళంగా రద్దు చేశారు? అసలు దీనికో ప్రాతిపదిక అంటూ ఉందా? ఎంత కాలంలో సమస్య పరిష్కారం అవుతుందని భావించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

Pages