S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/16/2017 - 03:36

అహ్మదాబాద్, జూలై 15: గుజరాత్ రాష్ట్రాన్ని భారీవర్షాలు ముంచెతుత్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మోర్బి, సురేంద్ర నగర్, రాజ్‌కోట్ జిల్లాల్లో కుండపోత వర్షాలతో నదులు, రిజర్వాయర్లు పొంగి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వరద నీటిలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మృతి చెందాడు.

07/16/2017 - 03:24

శ్రీనగర్, జూలై 15: కాశ్మీర్‌లో యువకులను అసభ్యకరమైన పదజాలంతో ధూషిస్తూ వారిపై అతిగా ప్రవర్తించిన సైనికులపై చర్యలు తీసుకుంటామని లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ సంధు తెలిపారు. సామాజిక మాధ్యమంలో వచ్చిన వీడియోపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన పిదప ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

07/16/2017 - 03:22

జమ్ము, జూలై 15: విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన లెటర్ హెడ్లను ఫోర్జరీ చేసి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి హెలికాప్టర్ టికెట్లు పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సందీప్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సుష్మా స్వరాజ్ పేరుతోనున్న లెటర్ హెడ్లను ఫోర్జరీ చేసి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు మంత్రి కోటా కింద ఇచ్చే హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు టికెట్లను పొందాడు.

07/16/2017 - 03:22

చండీగఢ్, జూలై 15: రాష్టప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మీరాకుమార్‌కు ఓటువేసే ప్రసక్తిలేదని ఆప్ సీనియర్ నేత, శాసన సభ్యుడు హెచ్‌ఎస్ ఫూల్కా ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఫూల్కా శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ మీరాకు మద్దతు ఇచ్చినా తాను మాత్రం ఓటువేసేది లేదని తేల్చిచెప్పారు.

07/16/2017 - 03:21

న్యూఢిల్లీ, జూలై 15: ఉపరాష్టప్రతి పదవికి పోటీచేసే అభ్యర్థి పేరును బిజెపి అధినాయకత్వం ఆదివారం ప్రకటించనున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్టప్రతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఆ వెంటనే ఎన్‌డిఏ నాయకులు సమావేశమై ఆ అభ్యర్థి పేరుకు ఆమోదముద్ర వేస్తారు.

07/16/2017 - 03:21

శ్రీనగర్, జూలై 15: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ అటవీ ప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు హతమైనారు. మరోవైపు రాజౌరీ సెక్టార్‌లో అధీన రేఖ వెంబడి ఉన్న భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యాలు భారీఎత్తున జరిపిన శతఘ్ని దాడులు కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు.

07/16/2017 - 03:20

డార్జిలింగ్, జూలై 15: ప్రత్యేక గూర్ఖా ఉద్యమాలతో డార్జిలింగ్ పర్వత ప్రాంతం శనివారం హోరెత్తిపోయింది. భారీ భద్రత మధ్య ర్యాలీలు మిన్నంటాయి. వరసగా 31రోజూ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) పిలుపుమేరకు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ ఎక్కడా హింసాత్మక ఘటనలు జరిగినట్టు సమాచారం లేదు.

07/16/2017 - 03:19

న్యూఢిల్లీ, జూలై 15: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదానికి మొత్తం 18బిల్లులు ఆమోదానికి రానున్నాయి. ప్రజావేగు పరిరక్షణ సవరణ బిల్లు, బిసిల జాతీయ కమిషన్ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొంది ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభ లిస్టింగ్‌లో ఈ బిల్లులు ఉన్నాయి.

07/16/2017 - 02:20

న్యూఢిల్లీ, జూలై 15: జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతలు, అమర్‌నాథ్ యాత్రికులకు రక్షణ వంటి కీలక అంశాలపై కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ఇక్కడ చర్చించారు. అరగంట సేపుజరిగిన సమావేశంలో జమ్మూకాశ్మీర్‌లోని తాజా పరిస్థితులను రాజ్‌నాథ్‌కు వివరించినట్టు అధికార వర్గాలు వెల్లడించారు.

07/15/2017 - 02:08

జంగీపూర్ (బెంగాల్), జూలై 14: ‘‘మరో పది రోజుల్లో రాష్టప్రతిగా నా పదవీకాలం పూర్తి కాబోతోంది. సాధారణ పౌరుడిగానే మీ ముందుకు రాబోతున్నాను’’ అని ప్రణబ్ ముఖర్జీ ప్రజలకు సందేశాన్నిచ్చారు. 35 సంవత్సరాల రాజకీయ జీవితం తర్వాత తొలిసారిగా 2004లో తాను తొలి విజయం సాధించిన జంగీపూర్ ప్రజల నుద్దేశించి మాట్లాడిన ఆయన ‘రాష్టప్రతిగా మళ్లీ మీ ముందుకు రాలేను’ అని అన్నారు.

Pages