S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/13/2017 - 02:50

గౌహతి/ ఇంఫాల్, జూలై 12: ఈశాన్య రాష్ట్రాలను మోరా తుపాను వణికిస్తోంది. అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. మోరా తుపాను ధాటికి అస్సాంలో 40 మంది మరణించినట్లు సమాచారం. ఇటు మణిపూర్‌లో 131 కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. అటు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.

07/13/2017 - 02:54

శ్రీనగర్, జూలై 12: అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన కుట్రదారు, పాకిస్తాన్ జాతీయుడు, లష్కర్ ఏ తోయిబా కమాండర్ అబూ ఇస్మాయిల్‌కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా దక్షిణ కాశ్మీర్‌లో ఇస్మాయిల్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను ట్రాక్ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

07/13/2017 - 02:31

శ్రీనగర్, జూలై 12: కాశ్మీర్‌లో ఉగ్రవాదం తుది దశకు చేరుకుందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషక్షంలో గత కొన్ని వారాలు, నెలలుగా నిర్ణయాత్మక పురోగతి సాధించామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అనంత్‌నాగ్ జిల్లాలో గత సోమవారం అమరనాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురిని హతమార్చిన రెండు రోజుల తర్వాత జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

07/13/2017 - 02:31

న్యూఢిల్లీ, జూలై 12: పాక్ సైనికులు దుస్సాహసానికి ఒడిగట్టారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి బుధవారం కాల్పులకు తెగబడ్డారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కరెన్ సెక్టార్‌పై విచారణారహితంగా కాల్పులు జరిపారు. పాక్ దళాల ఘాతుకంలో ఇద్దరు జవాన్లు కన్నుమూశారు.

07/12/2017 - 02:54

శ్రీనగర్/జమ్ము, జూలై 11: పటిష్ఠ బందోబస్తు మధ్యఅమర్‌నాథ్ యాత్ర యథాతథంగా సాగింది. 22,633 మంది యాత్రికులు అమరనాథుని దర్శనానికి వెళ్లారు. సోమవారం నాటి ఉగ్రదాడి ప్రభావం ఏమాత్రం చూపలేదు. యాత్రికుల్లో ఎటువంటి భయాందోళనలు కనిపించలేదు. సిఆర్‌పిఎఫ్, పోలీసుల భద్రత నడుమ మంగళవారం యాత్ర సాఫీగా సాగిపోయింది. జమ్ము నుంచి బల్తాల్, పహల్‌గామ్ క్యాంపులకు 68 వాహనాల్లో 3289 మంది యాత్రికులు తరలివెళ్లారు.

07/12/2017 - 02:50

న్యూఢిల్లీ, శ్రీనగర్, జూలై 11: అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతనాగ్‌లో గత రాత్రి జరిగిన ఈ సంఘటనకు యావత్ కాశ్మీర్ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు.

07/12/2017 - 02:45

న్యూఢిల్లీ, జూలై 11: అమర్‌నాథ్ యాత్రికులకు భద్రత మరింత పెంచాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి అనంత్‌నాగ్‌లో యాత్రికులపై ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమర్‌నాథ్ యాత్రలో కీలకమైన రెండు దారులలో భద్రతా చర్యలపై ఆయన ఆరా తీసారు.

07/12/2017 - 02:43

చిత్రాలు.. అమర్‌నాథ్ యాత్రికులకి సూరత్, అహ్మదాబాద్ లో శ్రద్ధాంజలి ఘటిస్తున్న పాఠశాల విద్యార్థులు

07/12/2017 - 02:43

చిత్రం.. సూరత్ చేరుకున్న అమర్‌నాథ్ యాత్రికుల మృతదేహాలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ తదితరులు.

07/12/2017 - 02:37

న్యూఢిల్లీ, జూలై 11: కాంగ్రెస్ నేతృత్వంలో ఉపరాష్టప్రతి పదవికి అభ్యర్థిగా ఎంపికైన గోపాలకృష్ణ గాంధీ, జాతిపిత మహాత్మాగాంధీ మనవడు. గాంధీజీ చిన్న కుమారుడు దేవదాస్ గాంధీకి, భారత్ తొలి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి కూతురు లక్ష్మికి 1945 ఏప్రిల్ 22న జన్మించారు. ఈయన సోదరుడు ప్రముఖ రచయిత రాజ్‌మోహన్ గాంధీ. 1985 నుంచి 1987వరకు గోపాలకృష్ణగాంధీ ఉపరాష్టప్రతికి కార్యదర్శిగా పనిచేశారు.

Pages