S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/11/2017 - 01:02

న్యూఢిల్లీ, జూలై 10: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత దేశంలో చైనా రాయబారి లురుూ ఝాఓహుయిని కలవటం వివాదాస్పదంగా మారింది. రాహుల్ చైనా రాయబారిని కలుసుకోలేదని మొదట చెప్పిన కాంగ్రెస్ ఆ తరువాత మాటమార్చింది. నిజమే రాహుల్ చైనా రాయబారిని కలుసుకున్నారు, ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమున్నదంటూ ఎదురు ప్రశ్నలు వేయటం ప్రారంభించింది. రాహుల్ గాంధీ కూడా పాలకపక్షంపై ఎదురుదాడికి దిగారు.

07/11/2017 - 00:58

న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో సులభతరమైన వ్యాపార నిర్వహణను ప్రోత్సహించాలని, ప్రజల్లో ఆధార్ కార్డ్ వినియోగాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించటానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మాట్లాడారు.

07/11/2017 - 00:52

శ్రీనగర్, జూలై 10: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న బస్సుపై సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు మహిళలున్నారు. దాడిలో మరో 32మంది గాయపడ్డారు. యాత్రికులంతా గుజరాత్ వాసులేనని పోలీసులు తెలిపారు.

07/10/2017 - 02:44

న్యూఢిల్లీ, జూలై 9: అంతర్జాతీయ వృద్ధి రేటులో భారత్ చైనాను అధిగమించిందని, బలమైన వృద్ధి ధృవంగా అవతరించిందని హార్వర్డ్ యూనివర్శిటీ తాజాగా జరిపిన సర్వేలో స్పష్టమైంది. చైనాపై భారత్ సాధించిన ఈ వృద్ధి రానున్న దశాబ్దంపాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని ఈ యూనివర్శిటీకి చెందిన అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం జరిపిన సర్వేలో వెల్లడైంది.

07/10/2017 - 02:42

న్యూఢిల్లీ, జూలై 9: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జత కడుతున్న ప్రతిపక్ష పార్టీలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో షాక్ ఇచ్చారు. మొత్తం పదిహేడు పార్టీలు తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు మంగళవారం ఢిల్లీలో సమావేశం అవుతున్న తరుణంలో ఆ భేటీకి తాను హాజరు కావడం లేదంటూ నితీష్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

07/10/2017 - 02:40

తిరువనంతపురం, జూలై 9: దేశంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేర్కొంటున్న పద్మనాభ స్వామి ఆలయం మరోసారి వార్తల్లోకొచ్చింది. ఈ ఆలయానికి చెందిన రెండో నేలమాళిగను తెరవాల్సిందేనంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ రెండో నేలమాళిగను తెరవడానికి వీలులేదని ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి చెందిన అశ్వవతి తిరునాళ్ గౌరీ లక్ష్మీబాయి స్పష్టం చేశారు.

07/10/2017 - 02:38

చిత్రాలు.. గురుపౌర్ణిమ సందర్భంగా మధురలో నదీస్నానం ఆచరించేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన బస్సులు... టాప్‌లపైనా ప్రయాణిస్తున్న దృశ్యం.. అమ్రోహలో భక్తులతో కిటకిటలాడుతున్న గర్‌ముక్తేశ్వర్ ఘాట్

07/10/2017 - 02:36

సేహోర్, జూలై 9: దుర్భర దారిద్య్రం కారణంగా పొలం దున్నడానికి ఎద్దులను కొనే స్తోమతు లేని ఓ పేద రైతు తన ఇద్దరు కుమార్తెలనే పొలం దునే్నందుకు ఎద్దులుగా వాడుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా సేహోర్‌లోనే హృదయ విదారకమైన ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

07/10/2017 - 02:34

న్యూఢిల్లీ, జూలై 9: అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పెద్దల సభ అయిన రాజ్యసభలో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలనుంచి రాజ్యసభలో కార్యకలాపాలు సాఫీగా జరిగిపోతాయని భావిస్తోంది. ఎగువ సభ చైర్మన్‌గా కూడా వ్యవహరించే ఉపరాష్టప్రతి పదవికి తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తూ ఉండడమే ఆ పార్టీ ధీమాకు కారణం.

07/10/2017 - 02:33

న్యూఢిల్లీ, జూలై 9: ప్రత్యేక గూర్ఖా రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గూర్ఖా సంయుక్త సంఘర్ష్ సమితి (జిఎస్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 110 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో వెంటనే రాష్టప్రతి పాలన విధించాలని జిఎస్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Pages