S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/07/2017 - 01:38

న్యూఢిల్లీ, జూలై 6: నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఉగ్రవాద నిరోధానికి అది చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ ఏడాది జూలై వరకు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పాలుపంచుకొంటున్న భద్రతా దళాలు 82 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. అంటే 2016 సంవత్సరం ఇదే సమయంలో భద్రతా దళాలు మట్టుబెట్టన 76 మంది ఉగ్రవాదులకన్నా 13 మంది ఎక్కువ.

07/07/2017 - 01:37

న్యూఢిల్లీ, జూలై 6: రోజు రోజుకూ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను నిరోధించడం అన్నది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదని, ఇందుకు పసల్‌బీమా వంటి దీర్ఘకాలిక సంక్షేమ పథకాలు చేపట్టడం ఒకటే మార్గమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రైతు ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది.

07/07/2017 - 01:32

న్యూఢిల్లీ, జూలై 6: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కోర్టుకు హాజరై తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడుల్లో టైట్లర్ నిందితుడిగా ఉన్నారు.

07/07/2017 - 01:32

న్యూఢిల్లీ, జూలై 6: సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి గవర్నర్ పదవి వంటి రాజ్యాంగ వ్యవస్థలను ఎందుకు తీసుకురాకూదని సుప్రీం కోర్టు గురువారం ప్రశ్నించింది. 2007లో గోవా రాజకీయ పరిస్థితికి సంబందించి అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ రాష్టప్రతికి అందించిన నివేదికను బహిర్గం చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

07/07/2017 - 01:31

న్యూఢిల్లీ, జూలై 6: రాష్టప్రతి ఎన్నికల్లో ఒక అభ్యర్థికి ఓటు వేయాలని తమ సభ్యులకు ఆదేశాలు జారీ చేసే రాజకీయ పార్టీలు చట్టపరంగా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఎన్నికల కమిషన్ గురువారం స్పష్టం చేసింది. అయితే పార్టీలు ఏ అభ్యర్థి తరఫునైనా ప్రచారం చేయవచ్చని, ఓటర్లను ఓటు వేయమని లేదా ఓటు వేయకుండా ఉండమని కోరవచ్చని ఇసి స్పష్టం చేసింది.

07/07/2017 - 01:31

న్యూఢిల్లీ, జూలై 6: తమ ఆస్తులు, ఆదాయాల వివరాలను సమర్పించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) తమ ఉద్యోగులను ఆదేశించింది. ఎన్‌సిటిఇ ఉద్యోగుల్లో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఎన్‌సిటిఇ ఈ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా బిఇడి, ఇతర టీచింగ్ శిక్షణా సంస్థలకు ఎన్‌సిటిఇ గుర్తింపు మంజూరు చేస్తుంది.

07/07/2017 - 01:01

న్యూఢిల్లీ, జూలై 6: భారత్-చైనాల మధ్య తలెత్తిన సిక్కిం వివాదం ముదురుపాకాన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. భారత్‌ను దారికి తెచ్చుకునేందుకు సిక్కిం వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వాలని కూడా చైనా భావిస్తున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. అదే క్రమంలో యుద్ధానికి సన్నద్ధమా అన్నరీతిలో టిబెట్ ఎగువ ప్రాంతాల్లోనూ చైనా సైనిక విన్యాసాలు సాగిస్తోంది.

07/07/2017 - 00:57

న్యూఢిల్లీ, జూలై 6: భారత దేశ 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆచల్ కుమార్ జ్యోతి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారి లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయ రీతిలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఈ గవర్నెస్ ప్రక్రియను క్రియాశీలకంగా పెంపొందిస్తామని 64ఏళ్ల ఆచల్ స్పష్టం చేశారు.

07/06/2017 - 03:07

న్యూఢిల్లీ, జూలై 5: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మత ఘర్షణలపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బుధవారం రాజ్‌నాథ్ మాట్లాడారు. ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో మతఘర్షణలు తలెత్తాయి. హుటాహుటిన సాయుధ దళాలను జిల్లాకు తరలించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు.

07/06/2017 - 03:06

న్యూఢిల్లీ, జూలై 5: భారతదేశం నరేంద్ర మోదీ అంత బలహీన ప్రధాన మంత్రిని ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా అద్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన చర్చల్లో ‘్భరత్ పాలనలో ఉన్న కాశ్మీర్’ అంటూ ట్రంప్ సంబోధించినా మోదీ ఖండించలేకపోయారని బుధవారం ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు.

Pages