S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/09/2017 - 02:43

కోల్‌కతా, జూన్ 8: హిల్ ఏరియా డార్జిలింగ్ ప్రాంతం గురువారం అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా జిజెఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డారు. నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువుప్రయోగించడారు. గుంపులను చెదరగొట్టడానికి లాఠీచార్జీ చేశారు. గూర్ఖాజన ముక్తి కార్యకర్తలు బస్సులపై రాళ్ల వర్షం కురిపించారు.

06/09/2017 - 02:42

న్యూఢిల్లీ, జూన్ 8: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌ను సందర్శిస్తున్న తొలి భారత ప్రదాని మోదీయే కావడం గమనార్హం. ప్రధాని మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన జూలై 4న ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం ఆయన ఇజ్రాయెల్పధాని బెంజమి నెతన్యాహుతో సమావేశమవుతారని పిటిఐ వార్తాసంస్థ తెలిపింది.

06/09/2017 - 02:41

డార్జిలింగ్, జూన్ 8: పశ్చిమ బెంగాల్‌లో పర్వత ప్రాంత అభివృద్ధి కోసం డార్జిలింగ్‌లో కొత్తగా సచివాలయం ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూ ల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ‘డార్జిలింగ్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొత్త సచివాలయానికి టెన్సింగ్ నార్కే పేరు పెడతాం’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

06/09/2017 - 02:41

న్యూఢిల్లీ, జూన్ 8: పొగాకు మహమ్మారి నుంచి ప్రజలను జాగృతం చేయడంతోపాటు ఉత్పత్తులవల్ల వచ్చే దుష్పరిణామాలు నిరోధించడానికి కృషిచేస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాకు అరుదైన పురస్కారం దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ నుంచి ప్రత్యేక అవార్డును నడ్డాకు ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌ఓ దక్షిణ-తూర్పు ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ కేంద్ర మంత్రి నడ్డాకు ఈ అవార్డు అందజేశారు.

06/09/2017 - 02:39

శ్రీనగర్, జూన్ 8: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగావ్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఓ సైనికుడు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. చొరబాట్లను తిప్పికొట్టే సందర్భంలో భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

06/09/2017 - 02:38

న్యూఢిల్లీ, జూన్ 8: దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పువాటిల్లినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని భారత సైనిక ప్రధానాధికారి బిపిన్ రావత్ గురువారం ఇక్కడ ప్రకటించారు. కాశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న మోసపూరిత ప్రచారం, ఎత్తుగడలు ఎప్పటికీ సాగవని ఆయన హెచ్చరించారు. ‘శతృదేశాల కవ్వింపు చర్యలను తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉంది.

06/09/2017 - 02:38

న్యూఢిల్లీ, జూన్ 8: సిపిఎం ప్ర ధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై దాడికి యత్నించిన ఘటనకు కార ణం సంఘ్ శక్తులంటూ ఆ పార్టీ చేసి న ఆరోపణలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రజాస్వామ్య, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నడూ ప్రోత్సహించదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై సిపిఎం పార్టీ సంఘ్ పరివార్ శక్తులు అంటూ చేసిన నిరాధారామైన ఆరోపణలను ఆర్‌ఎస్‌ఎస్ ఖండించింది.

06/09/2017 - 01:48

నయాగావ్ (మధ్యప్రదేశ్), జూన్ 8: మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన అయిదుగురు రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం మందసౌర్ రావడానికి యత్నించిన సందర్భంగా దాదాపు అయిదు గంటల సేపు హైడ్రామా చోటు చేసుకుంది.

06/09/2017 - 01:28

న్యూఢిల్లీ, జూన్ 8: ఇప్పటి వరకూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఈ నెల 16నుంచి రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనుకాబోతున్నాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అమలు అవుతున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు.

06/08/2017 - 02:34

న్యూఢిల్లీ, జూన్ 7: కొత్త రాష్టప్రతి ఎన్నిక నగారా మోగింది. ఎన్నిక ఏకగ్రీవం కానిపక్షంలో జూలై 17న ఓటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూలై 20న ఢిల్లీలో నిర్వహిస్తారు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగుస్తోంది. కొత్త రాష్టప్రతి జూలై 25న పదవీ బాధ్యతలు చేపడతారు.

Pages