S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/08/2017 - 02:33

న్యూఢిల్లీ, జూన్ 7: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

06/08/2017 - 02:32

న్యూఢిల్లీ, జూన్ 7: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చేసే ఖర్చు అనే ఒకే ఒక ఇంజన్‌తో నడుస్తోందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మత్రి ఎం వెంకయ్య నాయుడు బుధవారం ఎద్దేవా చేస్తూ నరేంద్ర మోదీ అనే అత్యంత శక్తివంతమైన ఇంజన్ సాయం తో భారత్ పరుగులు తీస్తోందనే విషయాన్ని ఆయన గ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

06/08/2017 - 02:31

మందసౌర్, జూన్ 7: పంట రుణాలను మాఫీ చేయాలని, తాము పండించిన పంటల కు మెరుగైన ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో రైతులు చేస్తున్న ఆందోళన మంగళవారం భారీ ఎత్తున హింసాకాండకు దారితీసిన విషయం తెలిసిం దే. మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతోపాటు పోలీసులపై సైతం రాళ్ల వర్షం కురిపించడం లాంటి చర్యలకు పాల్పడ్డం, హింసాకాండలు అయిదుగురు చనిపోవడం తెలిసిందే.

06/08/2017 - 02:31

న్యూఢిల్లీ, జూన్ 7: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందుసేనా కార్యకర్తలు దాడికి యత్నించారు. ఢిల్లీలో బుధవారం నాడు సిపిఎం ప్రధాన కార్యాలయం ఎ.జి.కె.్భవన్‌లో సీతారాం ఏచూరి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశానికి వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆయన్ని అడ్డుకోవడానికి యత్నించారు. ‘‘్భరత్ సేనా జిందాబాద్... సిపిఎం పార్టీ ముర్దాబాద్’’ అంటూ వారు నినాదాలు చేశారు.

06/08/2017 - 02:30

న్యూఢిల్లీ, జూన్ 7: కోల్‌కతా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించలేదు. తన అరెస్టు వారెంట్‌పై స్టే ఇవ్వాలన్న కర్ణన్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటున్న న్యాయమూర్తికి ఆరునెలల జైలుశిక్ష విధిస్తు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిం ది. అయితే కర్ణన్ అరెస్టును తప్పించుకుం టూ వస్తున్నారు.

06/07/2017 - 03:58

న్యూఢిల్లీ, జూన్ 6: జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోనియాగాంధీ ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజూ మరణాలు సంభవిస్తున్నాయని, దానికి ఎన్‌డిఏ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

06/07/2017 - 03:32

లక్నో, జూన్ 6: ఉత్తరప్రదేశ్‌లో టెన్త్ ఉత్తీర్ణత సాధించే బాలికలకు పదివేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు యూపీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మంగళవారం ఓ ప్రకటన చేశారు. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ 2017 ఫలితాలు ఇప్పటికే ప్రకటించారు.

06/07/2017 - 03:32

న్యూఢిల్లీ, జూన్ 6: రాష్టప్రతి, ఉపరాష్టప్రతి పదవులకు ప్రతిపక్షం తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఒక ఉప సంఘాన్ని ఏర్పాటుచేసినట్టు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం ఏఐసిసిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆజాద్ ఈ విషయం వెల్లడించారు.

06/07/2017 - 03:31

న్యూఢిల్లీ, జూన్ 6: ప్యారిస్ పర్యావరణ ఒప్పం దం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయంపై అమెరికా పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

06/07/2017 - 03:30

న్యూఢిల్లీ, జూన్ 6: మహిళలను జవాన్లుగా నియమించాలన్న ఆలోచనకూ సర్వత్రా సానుకూల మద్దతు లభిస్తోంది. మాజీ సైనికాధికారులు సహా అనేక వర్గాలు ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఇప్పటికప్పుడే అని కాకుండా క్రమానుగతంగానే మహిళలను జవాన్లుగా నియమించే ప్రక్రియను చేపట్టాలని వీరంతా సూచించారు.

Pages