S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/02/2017 - 02:37

న్యూఢిల్లీ, మే 1: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్‌కు ఈ నెల 4వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కూడిన బోర్డు ఈ పరీక్షలు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

05/02/2017 - 02:35

దెదియాపడా (గుజరాత్), మే 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించాల్సిన మోదీ తాను చెప్పే మాటలను ప్రజలు వినేలా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు.

05/02/2017 - 01:31

ఢిల్లీ/ హైదరాబాద్, మే 1: ఐఎస్‌ఐఎస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. యువతను రెచ్చగొట్టేందుకు పోలీసులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారమిచ్చారా? అధికారమిస్తే దానికి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

05/02/2017 - 02:11

న్యూఢిల్లీ, మే 1: రామానుజా చార్యుల సహస్ర జయంతి సందర్భంగా స్మారక స్టాంపును ప్రధాని మోదీ సోమవారం విడుదల చేశారు. సమాజం సమష్ఠిగా ముందుకు సాగాలన్నదే రామానుజాచార్యుల జీవిత సందేశ పరమార్థమని మోదీ ఉద్ఘాటించారు. మనుషుల్లో దైవ స్వరూపాన్ని చూసిన రామానుజాచార్యులు దైవ భక్తులందరినీ సమానంగా పరిగణించారని మోదీ శ్లాఘించారు.

05/02/2017 - 01:28

న్యూఢిల్లీ/ జమ్ము, మే 1: పాకిస్తాన్ దౌష్ట్యం పరాకాష్టకు చేరుకుంది. శత్రు సైనికుడు సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ పట్టుబడితే వారి పట్ల ఎలా వ్యవహరించాలో అన్న నైతికతను పాతరపెట్టింది. అన్ని నియమాలను ఉల్లంఘించి.. భారత భూభాగంలోకి దాదాపు 250 మీటర్ల మేర చొచ్చుకుని వచ్చి విచక్షణ లేకుండా కాల్పులు జరిపి ఇద్దరు సైనికులను హతమార్చింది. అంతటితో పాక్ సైన్యం కసి తీరలేదు.

05/02/2017 - 00:36

న్యూఢిల్లీ, మే 1: ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 35 మంది ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు మద్దతు తెలుపుతూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాయడం కలకలం రేపింది.

05/02/2017 - 00:35

లక్నో, మే 1: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పాలనాపరంగా ఎన్నో సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి తగిన చర్యలు తీసుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగని మంచి పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలని అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

05/02/2017 - 00:34

న్యూఢిల్లీ, మే 1: పార్లమెంట్ సభ్యుడు, బిజెపి ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిని ముట్టడించి ఆయన సిబ్బందిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను (సోదరులను) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

05/02/2017 - 00:34

షేఖ్‌పురా/లఖిసరాయ్, మే 1: బిహార్‌లోని సరాయ్ స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న వారిని అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొన్న సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రామ్‌పూర్‌ఘాట్-గయ ప్యాసింజర్ రైలు నుంచి దిగిన కొంతమంది ప్రయాణికులు ఫుట్‌వోవర్ బ్రిడ్జి ఎక్కకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశారు.

05/02/2017 - 00:33

న్యూఢిల్లీ, మే 1: దేశ సరిహద్దులో, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సమీక్షించారు. ప్రధానంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఇద్దరు జవాన్లు మృతిచెందిన ఘటనపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. అక్కడ పరిస్థితులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Pages