S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/28/2017 - 02:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నారని యుక్తవయస్కులైన అమెరికన్లలో కేవలం 25 శాతం మంది మాత్రమే నమ్ముతున్నారు. ‘టైమ్-సర్వే మనీ’ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఈ విషయం వెల్లడయింది.

04/28/2017 - 02:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మణిపూర్‌లో గత 20 ఏళ్లలో జరిగిన 1528 బూటకపు ఎన్‌కౌంటర్ ఆరోపణలు వచ్చిన కేసులపై దర్యాప్తు జరిపించాలని 2016లో ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని కేంద్ర అపభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

04/28/2017 - 01:57

ముంబయ, ఏప్రిల్ 27: ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా (70) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11.20కు తుదిశ్వాస విడిచారు. వినోద్ మృతిపట్ల భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.

04/28/2017 - 01:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశ వ్యాప్తంగా అవినీతి, లంచగొండితనంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 20 రాష్ట్రాలలో అవినీతి, లంచగొండితనంపై ఇండియన్ కరప్షన్ స్టడీ పేరుతోమీడియా స్టడీస్ సెంటర్ (సీఎంఎస్) సంస్థ చేసిన సర్వే వివరాలను ఆ సంస్థ ఢిల్లీలో విడుదల చేసింది.

04/28/2017 - 01:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: తెంలగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో న్యాయాధికారుల నియామకానికి కొత్త మార్గదర్శక సూత్రాలను తయారు చేయాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు చలమేశ్వర్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం ఈ ఆదేశాన్ని జారీ చేసింది.

04/28/2017 - 01:27

సిమ్లా, ఏప్రిల్ 27: విమాన ప్రయాణం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరల్లో దేశీయంగా ప్రయాణించేందుకు రూపొందించిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్)’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా సబ్సిడీ పై నడిపించే 42 సీట్ల ఏటిఆర్ విమానం తొలి ప్రయాణాన్ని సిమ్లా నుంచి న్యూఢిల్లీకి పయనమైంది.

04/28/2017 - 01:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐఐటిలతో సహా దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కాలేజిల్లో ప్రవేశంకోసం నిర్వహించిన జెఈఈ-మెయిన్ పరీక్షలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్‌పిత్ వీర్వల్ నూటికి నూరు శాతం మార్కులు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. జెఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను సిబిఎస్‌ఇ గురువారం విడుదల చేసింది. 1781 కేంద్రాల్లో 10.2 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.

04/27/2017 - 07:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి పటిష్ఠమైన ప్రణాళికాబద్ధ విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, నిర్ణయించిన కాలపరిమితులను కచ్చితంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మంగళవారం రాత్రి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, డిజిటల్ రంగాల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

04/27/2017 - 07:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ‘యుడిఎఎన్’ (ఉడాన్) పథకాన్ని ప్రారంభించనున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచడానికి తక్కువ వ్యయంతో విమానయాన సౌకర్యాన్ని ఈ పథకం కల్పిస్తుంది. సిమ్లా- ఢిల్లీ సెక్టార్‌తో పాటు కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ సెక్టార్లలో విమాన సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.

04/27/2017 - 03:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలనే ఆలోచన కేంద్రానికి లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నీతి ఆయోగ్ నివేదికలోని వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించేందుకు సంబంధించిన అంశాన్ని చదివాను. ఈ అంశంపై ఎవరికి ఎలాంటి అనుమానం, సందిగ్దం ఉండకూడదనే ఈ ప్రకటన చేస్తున్నాను. వ్యవసాయం, వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలనే ఆలోచన కేంద్రానికి ఎంతమాత్రం లేదు.

Pages