S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/27/2017 - 03:34

మూడు మున్సిపాలిటీల్లో ఘనవిజయం

కేజ్రీవాల్‌కు కోలుకోలేని దెబ్బ మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ కొత్త వారితో బిజెపి ప్రయోగం సక్సెస్
ఇది ఈవీఎంల విజయమని ఆప్ ఆరోపణ ఢిల్లీ ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు

04/26/2017 - 07:59

సిలిగురి, ఏప్రిల్ 25: పశ్చిమబెంగాల్‌లో దూసుకొస్తున్న మోదీ రథాన్ని అడ్డుకునే శక్తి తృణమూల్ కాంగ్రెస్‌కు లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో కమలం వికసించటం తథ్యమని ఆయన అన్నారు. ‘మోదీ రథాన్ని అడ్డుకోగలమని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తూండవచ్చు. వాళ్లు మమ్మల్ని ఎంతగా అడ్డుకోవాలని చూస్తే, అంతకంటే వేగంగా కమలం బెంగాల్‌లో వికసిస్తుంది’ అని ఆయన అన్నారు.

04/26/2017 - 06:33

భూసేకరణ చట్టాన్ని తిప్పిపంపిన కేంద్రం

కీలక పదాల్లో మార్పులకు సూచన
అత్యవసరంగా సమావేశమైన సిఎస్
వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
కేంద్రం సూచనలతో మళ్లీ బిల్లు
చట్టం ఆలస్యంపై మల్లగుల్లాలు
నీటిపారుదల శాఖకు పెద్ద దెబ్బ

04/26/2017 - 06:16

రాయపూర్, ఏప్రిల్ 25: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నక్సలైట్లు జరిపిన మెరుపుదాడిలో 25మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో కదిలి పోయిన కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌పై పోరులో ప్రభుత్వ వ్యూహాన్ని సమీక్షించుకుంటామని మంగళవారం ప్రకటించింది.

04/26/2017 - 06:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఐదు అవార్డులు ప్రదానం చేసింది. దేశ రాజధానిలో మంగళవారం హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హడ్కో సేవలు అందిస్తున్న రాష్ట్రాలకు, వివిధ సంస్ధలకు అవార్డులను ప్రదానం చేసింది.

04/26/2017 - 06:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారా లేక ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తారా? అనే విషయమై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. నరసింహన్ పదవీ కాలం మే మూడో తేదీతో ముగుస్తోంది. ఆంధ్ర, తెలంగాణతోపాటు తమిళనాడు, జమ్ముకాశ్మీర్, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించవలసి ఉన్నది.

04/25/2017 - 07:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలో అత్యంత రద్దీగా ఉండే రూట్లలో డబుల్ డెక్కర్ ఏసి రైళ్లను నడపనున్నారు. న్యూఢిల్లీ-లక్నో మార్గంలో జూలైనుంచి ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఏసి చైర్‌కార్‌తో రాత్రిళ్లు రైలు నడపనున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అయితే డబుల్ డెక్కర్ ఏసి రైలులో స్లీపర్ బెర్తులు ఉండవు. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే సెమీస్లీపర్ సీట్లు ఉంటాయి. ఒక్కో బోగీలో 120 మంది ప్రయాణించవచ్చు.

04/25/2017 - 07:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత బంగ్లా సరిహద్దుల్లో ఆవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు, పాడి పశువుల సంరక్షణకు దేశ వ్యాప్తంగా ప్రతి పశువుకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని నిపుణుల కమిటీ సూచించిందని కేంద్రప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు విన్నవించింది.

04/25/2017 - 07:56

శ్రీనగర్, ఏప్రిల్ 24: కాశ్మీర్‌లో ఐదు రోజుల విరామం తరువాత సోమవారం విద్యా సంస్థలు తెరుచుకున్న సందర్భంలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. విద్యార్థులు భద్రతాదళాలపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు. శ్రీనగర్‌లోని ఎస్‌పి కాలేజీ నుంచి ఎంఏ రోడ్డులో విమెన్స్ కాలేజీ వరకూ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

04/25/2017 - 06:43

హైదరాబాద్, ఏప్రిల్ 24:రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పెనుమాక గ్రామంలో ప్రభుత్వం చేపట్టదలచిన భూసేకరణపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు సిఆర్‌డిఎకు, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, వాటిని పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

Pages