S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/24/2017 - 07:05

ఉజ్జయిని, ఏప్రిల్ 23: ముస్లిం మతానికి చెందిన తౌసిఫ్ షేక్ అనే వ్యక్తి తన భార్య అర్షీఖాన్‌కు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం చెల్లదని ఉజ్జయిని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తౌఫిక్ ముస్లిం మత సాంప్రదాయాలను పాటించకుండా విడాకులు ఇవ్వడం అక్రమమని, కనుక ఇది చెల్లబోదని అడిషనల్ ప్రిన్సిపల్ జడ్జి ఓంప్రకాష్ శర్మ గత నెల 9న తేల్చిచెప్పారు. బాధితురాలి తరఫు న్యాయవాది కథనం ప్రకారం..

04/24/2017 - 07:01

దేశంలోని సాగుభూముల్ని పంటల విభాగాలుగా చేయాలి
పరిశోధనలకు ఊతం అనుబంధ పరిశ్రమలకు మద్దతు
మన్రేగాలో మార్పులు అవసరం
8 ప్రతిపాదనలతో నీతిఆయోగ్‌కు కెసిఆర్ నివేదిక

04/24/2017 - 06:53

ఏకకాల ఎన్నికలపై ప్రధాని మోదీ పిలుపు

నీతి ఆయోగ్ సహకార సమాఖ్యకు స్ఫూర్తి
నవభారతానికి ‘టీమ్ ఇండియా’ సమాయత్తం
ముఖ్యమంత్రుల హాజరుపై పిఎం ప్రశంస
ఆయోగ్ భేటీకి మమత, కేజ్రీవాల్ గైర్హాజరు

04/24/2017 - 06:52

నీతి ఆయోగ్ భేటీలో సై అన్న చంద్రబాబు

ఏపిని కేంద్రం ఆదుకోవాలి రైల్వే జోన్ తక్షణావసరం
ప్యాకేజీ అమలుపై దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి డిమాండ్

04/23/2017 - 03:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రకృతిని, ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలన్న చైతన్యం ప్రజల్లో పెరుగుతుందన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ధరిత్రి దినాన్ని పురస్కరించుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘్ధరిత్రి దినం అంటే భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకునే దినం.

04/23/2017 - 03:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అన్నాడిఎంకె పార్టీ గుర్తయిన రెండాకుల గుర్తును తమ వర్గానికి లభించేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపారన్న ఆరోపణపై శశికళ మేనల్లుడు శుక్రవారం ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. శనివారం ఉదయం చెన్నైనుంచి ఢిల్లీ వచ్చిన దినకరన్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఢిల్లీ పోలీసు క్రైమ్‌బ్రాంచ్ ఇంటర్‌స్టేట్ విభాగం కార్యాలయానికి వచ్చారు.

04/23/2017 - 03:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: తమ సమస్యలు పరిష్కరించాలంటూ 39 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న తమిళనాడు రైతులు శనివారం మూత్రం తాగారు. అర్ధనగ్న ప్రదర్శనలు, శవయాత్రలు, కప్పలు, పాములను కొరకడం వంటి వినూత్న నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.

04/23/2017 - 03:40

లక్నో, ఏప్రిల్ 22: ఉత్తరప్రదేశ్‌లో గూండాగిరీని, దాదాగిరీని, దౌర్జన్యాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని రాష్ట్ర కొత్త డిజిపి సుల్‌ఖాన్ సింగ్ స్పష్టం చేశారు. నేరం చేస్తే విఐపిలను కూడా వదలిపెట్టబోమని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగంతో నిష్పక్షపాతంగా పనిచేయించడానికే తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.

04/23/2017 - 03:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో లభించే అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపట్ల వ్యాపార వర్గాల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేయర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశంలో అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వానికి ఊపునిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

04/23/2017 - 02:50

ఆగ్రా, ఏప్రిల్ 22: కాషాయ రంగు స్కార్ఫ్‌లు ధరించిన సందర్శకులను సిబ్బంది తాజ్‌మహల్‌లోకి అనుమతించ లేదంటూ వచ్చిన వార్తలపై శనివారం బజరంగ్ దళ్, ఇతర హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు తాజ్‌మహల్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం కాషాయ రంగు స్కార్ఫ్‌లు ధరించి తాజ్మహల్‌ను చూడడానికి వచ్చిన మోడల్స్‌ను వాటిని బయటే వదిలిపెట్టి రావాలని సిబ్బంది కోరినట్లు వారు ఆరోపించారు.

Pages