S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/22/2017 - 01:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ యోజన (పిఎంజికెవై)కింద నల్లధనం కలిగి ఉన్న వారు తమ పన్ను చెల్లింపులు, డిపాజిట్లకు సంబంధించిన డిక్లరేషన్లను మే 10 దాకా సమర్పించవచ్చని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

04/22/2017 - 01:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22:దేశంలో దిక్కులేని వితంతువుల గోడు పట్టదా అంటూ సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. ‘మేము ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామంటారు..మీ అంతట మీరు ఎలాంటి చర్యలూ తీసుకోరు’అని న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

04/21/2017 - 04:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: రాజకీయ కార్యనిర్వాహకులు తప్పుడు ఆదేశాలు జారీచేస్తే వాటిని పాటించాల్సిన అవసరం లేదని, ఆ ఆదేశాలు తప్పని వెల్లడించే చట్టపరమైన నిబంధనలను వారికి చూపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు ఉద్బోధించారు. ‘మీరు చెబుతున్నది చట్టానికి వ్యతిరేకం అని వారికి తెలియజేయండి. ఫైల్ మీద సంతకం చేయకండి’ అని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

04/21/2017 - 03:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ గురువారం తీవ్రంగా తప్పుబట్టింది. పొరుగు దేశంలోని రాష్ట్రాలకు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన అక్రమ ఆక్రమణ సక్రమం అయిపోదని చైనాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

04/21/2017 - 03:11

వారణాసి, ఏప్రిల్ 20: వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్‌లకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి.. మీ గ్రూప్‌లో తప్పుడు వార్తలు పోస్ట్ చేసినా, వదంతులను ప్రచారం చేసినా ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోక తప్పదు. గ్రూప్‌లో ఏ సభ్యుడు తప్పు చేసినా, అందుకు సదరు సభ్యుడితోపాటు అడ్మినిస్ట్రేటర్ కూడా బాధ్యుడే అవుతాడు. ఫోటోలు, మనసుల్ని ఇబ్బంది పెట్టే వీడియోలు పోస్ట్ చేసినా నేరంగానే పరిగణిస్తారు.

04/21/2017 - 03:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ప్రభుత్వ వాహనంపై ఎర్రబుగ్గ కనిపించకుండా కవర్ వేసి దాన్లోనే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసుకు వచ్చారు. హిమాచల్ సంప్రదాయ టోపీ ధరించిన 82 ఏళ్ల వీరభద్ర సింగ్ మీడియాతో ఒక్క మాట మాట్లాడలేదు.

04/21/2017 - 03:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై మరోసారి మే 25న తన ముందు హాజరుకావాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్థారుూ సంఘం ఆదేశించింది. ఉర్జిత్ పటేల్‌ను మరోసారి పిలిపించాలని కమిటీలోని బిజెపి ఎంపీలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒత్తిడి తేవడంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

04/21/2017 - 02:46

చెన్నై, ఏప్రిల్ 20: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె వైరి వర్గాల విలీనానికి మళ్లీ చుక్కెదురైంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం గురువారం కొత్త మెలిక పెట్టడంతో వ్యవహారం మొదటికొచ్చింది. వికె శశికళ, ఆమె బంధువు టిటివి దినకరన్‌లను లాంచనంగా బహిష్కరిస్తే తప్ప విలీనం చర్చయలు ముందుకు సాగవమని పన్నీర్ సెల్వం తెగేసి చెప్పారు.

04/21/2017 - 02:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:వ్యాపార సంస్థలుగా కాకుండా విద్యా సంస్థలుగా వ్యవహరించాలని తన అనుబంధ పాఠశాలలకు సిబిఎస్‌ఇ చురక వేసింది. స్కూళ్లలోనే లేదా ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ విక్రయాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సిబిఎస్‌ఇ తీవ్రంగా స్పందించింది.

04/21/2017 - 02:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నియమించిన నలుగురు సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కమిషనర్లుగా కొనసాగుతున్న వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, ఎం విజయనిర్మల నియామకాలు చెల్లవని, వారు వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Pages