S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/21/2017 - 02:04

ముంబయి/లక్నో, ఏప్రిల్ 20: దేశంలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడికి కుట్ర జరుగుతోందనే అనుమానంతో అయిదు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 10 మంది ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

04/21/2017 - 02:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం పర్యావరణానికి అనుకూలంగా ఉందా, లేదా? అన్న అంశంపై తీర్పును జాతీయ హరిత ట్రిబ్యునల్ రిజర్వ్ చేసింది. ఏపీ నూతన రాజధాని నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఏన్జీటి)లో వాదనలు ముగిశాయి. దాదాపు 20 నెలలపాటు విచారణ సాగింది.

04/21/2017 - 04:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: విఐపిలకు కల్పిస్తున్న భద్రతను తగ్గించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు వంటి ఎమర్జెన్సీ వాహనాలు మినహా మిగతా వాహనాలన్నింటిపై ఎర్ర బుగ్గల (బెకన్ లైట్ల) వినియోగాన్ని బుధవారం నిషేధించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

04/21/2017 - 01:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

04/21/2017 - 01:00

ముంబయి, ఏప్రిల్ 20: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు వ్యతిరేకంగా ఇక్కడి ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఉగ్రవాద కేసులో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద జకీర్ నాయక్, మరికొందరిపై నిరుడు కేసు నమోదు చేసింది.

04/21/2017 - 01:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి విచారణ వివరాలను అందించాలని, అదే విధంగా ఈ కేసులో అప్పీల్ చేసే ప్రక్రియను కూడా తెలియజేయాలని భారత్ అధికారికంగా పాకిస్తాన్‌ను కోరింది. గూఢచర్యం నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

04/21/2017 - 00:59

చెన్నై, ఏప్రిల్ 20: రెండాకుల గుర్తుకోసం ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ శనివారం ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం రాత్రి దినకరన్‌కు సమన్లు అందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ నేతృత్వంలో పోలీసు అధికారులు చెన్నై బసంత్ నగర్‌లోని దినకరన్ ఇంటికి వచ్చి సమన్లు అందజేశారు.

04/21/2017 - 00:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: యమునా నది తీరం ధ్వంసం కావడానికి కేంద్ర ప్రభుత్వం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) కారణమంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్‌జిటి గురువారం మండిపడింది. యమునా నది తీరాన్ని ధ్వంసం చేసింది కాక, దానికి తనను కారణమంటూ రవిశంకర్ ఆరోపించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘మీకు బాధ్యత గురించిన వివేకం లేదు.

04/20/2017 - 05:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కుట్ర కేసును సుప్రీం కోర్టు పునరుద్ధరించినంత మాత్రాన తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రశే్న లేదని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగటం తథ్యమని ఆమె చెప్పారు. బాబ్రీ కూల్చివేతకు సంబంధించి తాము ఏం చేసినా అంతా బహిరంగంగానే చేశామని, ఇందులో కుట్ర లేనేలేదని ఆమె చెప్పారు.

04/20/2017 - 05:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వినియోగించడానికి పేపర్ ట్రయల్ మెషిన్లను కొనుగోలు చేయాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ల (ఇవిఎంల)తోపాటు పేపర్ ట్రయల్ మెషిన్లను ఉపయోగించాలని ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Pages