S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/17/2017 - 04:51

లక్నో, ఏప్రిల్ 16: తమ వైవాహిక చట్టాన్ని పాటించే రాజ్యాంగ హక్కు ముస్లింలకు ఉందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు విషయంలో బోర్డు సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తుందని బోర్డు ప్రధాన కార్యదర్శి వౌలానా వలీ రెహమాని స్పష్టం చేస్తూ, కోర్టు వెలుపల పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

04/17/2017 - 04:50

భువనేశ్వర్, ఏప్రిల్ 16: భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి భువనేశ్వర్ వచ్చిన ప్రదాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడి ప్రఖ్యాత లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాని ఆలయం వద్దకు చేరుకోగానే ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో జనం దగ్గర్లోని భవనాలపైకి చేరుకుని ఆయనకు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. వారిని చూసి ఆయన సైతం వారి వైపు చేతులూపారు.

04/17/2017 - 04:47

భువనేశ్వర్, ఏప్రిల్ 16: స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు పోషించిన గణనీయమైన పాత్రను జనానికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 50చోట్ల వాస్తవిక మ్యూజియంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం ఇక్కడ 1817లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒడిశాలో సాయుధ తిరుగుబాటు (పైకా తిరుగుబాటు) జరిపిన 16 మంది గిరిజన స్వాతంత్య్ర యోధుల కుటుంబ సభ్యులను ప్రధాని సత్కరించారు.

04/17/2017 - 04:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో ఈ ఏడాది చివరి నాటికి మరో 31 కొత్త భూకంప విజ్ఞాన పరిశోధనాలయాలు (సిస్మాలాజికల్ అబ్జర్వేటరీలు) ఏర్పడనున్నాయి. ఇవి అందుబాటులోకి రావడం వల్ల భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే సామర్థ్యం మరింత పెరుగుతుంది.

04/17/2017 - 04:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: బెంగళూరు నగర నడిబొడ్డున గల ‘బీలియు’ ఎస్టేట్‌ను 117 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు దివాన్ తన పెద్ద కుమార్తె పేరిట కొనుగోలు చేశారని, అందువల్ల ఆ ఎస్టేట్‌పై కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారసత్వ సంపద అయిన ఈ ఎస్టేట్ 24 ఎకరాల విస్తీర్ణంలో బెంగళూరులోని ప్రైమ్ ప్యాలెస్ రోడ్‌లో ఉంది.

04/17/2017 - 04:41

ప్రధాని నరేంద్ర మోదీ సూరత్ పర్యటన సందర్భంగా నగర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఎయర్ పోర్టు రోడ్డులో 11 కి.మీ మేర బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లో మోదీ చిన్నప్పటి నుంచి వివిధ రకాల ఫోటోలను ప్రదర్శించారు.

04/17/2017 - 03:09

సూరత్, ఏప్రిల్ 16: స్వరాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకోసం ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్న ప్రదాని నరేంద్ర మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. భువనేశ్వర్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని అక్కడినుంచి ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్నారు. విమానాశ్రయంనుంచి సర్క్యూట్ హౌస్ దాకా జరిగిన భారీ రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు.

04/17/2017 - 03:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురి జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన విచారించేందు సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టులోని జడ్జీలను నియమించనుంది. అందులో భాగంగా పది హైకోర్టులలో 51 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

04/17/2017 - 02:26

శ్రీనగర్, ఏప్రిల్ 16: శ్రీనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగి వారం రోజులైనా కాకుండానే టెర్రరిస్టుల మరో ఘాతుకం బయటపడింది. దక్షిణ కాశ్మీర్‌లో ఓ పిడిపి నేత, మరో కార్మిక సంఘం నాయకుడి తలకు తుపాకీ గురిపెట్టి మరీ భారత వ్యతిరేక నినాదాలు చేయించిన రెండు వీడియోలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది.

04/17/2017 - 02:14

భువనేశ్వర్, ఏప్రిల్ 16: సమాజంలో దురాచారాలు, చెడు సంప్రదాయాలపై పోరాడటానికి ప్రజలు చైతన్యవంతులు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ట్రిపుల్ తలాఖ్ అంశంపై ఆయన స్పందిస్తూ ‘‘మన ముస్లిం సోదరీమణులకు న్యాయం జరగాలి. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగటానికి వీల్లేదు. ఈ అంశంపై ముస్లిం సమాజంలో ఎలాంటి సంఘర్షణకు తావు ఇవ్వరాదు.

Pages