S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/14/2017 - 03:30

న్యూఢిల్లీ,ఏప్రిల్ 13: రాష్టప్రతి భవన్‌లో రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మొత్తం 44 మంది ప్రముఖులు పద్మ అవార్డులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గురువారం నాడు అందుకున్నారు. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, ప్రముఖ గాయకుడు కెజె ఏసుదాస్ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మవిభూషణ్’ అవార్డులను అందుకున్నారు.

04/14/2017 - 03:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించిన భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఎక్కడున్నదీ, ఆయన ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడన్నది తెలియదని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. 46 సంవత్సరాల జాదవ్ పాకిస్తాన్‌లో ఎలా ఉన్నాడన్న దానిపై వివరాలు సేకరిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

04/14/2017 - 03:15

ముంబయి, ఏప్రిల్ 13: భారతీయ నేవీ మాజీ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే స్పష్టం చేశారు. పాక్ కోర్టు తీర్పును హత్యగా ఆయన అభివర్ణించారు. దీనిపై అంతర్జాతీయ దౌత్యపరంగా పాకిస్తాన్‌పై వత్తిడి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఇక్కడ వెల్లడించారు.

04/14/2017 - 03:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో విచారణకు హాజరకావలని ఈడి నోటీసులు ఇచ్చినా సింగ్ బేఖాతరు చేశారు. దీంతో గురువారం మళ్లీ ఈడి నోటీసులు ఇచ్చింది. ఈనెల 20 దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

04/14/2017 - 03:13

ముంబయి, ఏప్రిల్ 13: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అధినేత,జకీర్ నాయక్‌కు మనీలాండరింగ్ కేసులో చుక్కెదురయింది. అతనికి వ్యతిరేకంగా నాన్ బెయిలేబుల్ అరెస్టు వారెంటు (ఎన్‌బిడబ్ల్యు) జారీ అయింది. ముంబయిలోని పిఎంఎల్‌ఎ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టు గురువారం నాయక్‌ను ఏ క్షణంలోనయినా అరెస్టు చేసేందుకు వీలుగా ఎన్‌బిడబ్ల్యును జారీ చేసింది.

04/14/2017 - 03:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పేపర్ ట్రయల్ లేకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఇవిఎం) ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బిఎస్పీ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.

04/14/2017 - 03:11

తిరువనంతపురం, ఏప్రిల్ 13: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) టాంపరింగ్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణకు అర్థం లేదని కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు అంటూ, అది ఆ పార్టీకే ఎదురుతిరుగుతుందని అన్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొత్తకొత్త సమస్యలను సృష్టిస్తోందని కూడా ఆయన అన్నారు.

04/14/2017 - 03:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13:తీవ్రవాద భావాల వ్యాప్తితో యువతను తప్పుదోవ పట్టించడం ద్వారా పాకిస్తాన్ జమ్మూ, కాశ్మీర్‌లో పౌర ప్రతిఘటనను ప్రోత్సహిస్తోందని కేంద్ర హోం మంత్రిత్వ వాఖ తన వార్షిక నివేదికలో ఆరోపించింది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రవాద హింసాకాండకు సరిహద్దులగుండా ఉగ్రవవాదుల చొరబాటుకు అవినాభావ సంబంధం ఉందని బుధవారం విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలో హోం శాఖ తెలిపింది.

04/14/2017 - 02:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: డిఎస్సీ 98 వివాదంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లను తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగ నియామకాలలో వ్యవహరించామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో 19ఏళ్లుగా వివిధ న్యాయస్థానాలలో కొనసాగుతున్న ఈ కేసును గురువారం సుప్రీంకోర్టు తెరదించినట్లు అయింది.

04/14/2017 - 02:40

లక్నో, ఏప్రిల్ 13: రాష్టవ్య్రాప్తంగా ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో కోటా ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదాత్యనాథ్ గురువారం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయానికి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.

Pages