S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/10/2017 - 00:33

గౌహతి, ఏప్రిల్ 9: ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని పేర్కొనే జనాభా విధానం ముసాయిదాను అస్సాం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని బాలికలందరికీ విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యను ఉచితంగా అందించనున్నట్లు కూడా ఈ జనాభా విధానం ముసాయిదా పేర్కొంది. అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.

04/10/2017 - 00:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత్‌లో నాలుగు రోజుల పర్యటనకోసం ఆస్ట్రేలియా ప్రధాని మాల్కొమ్ టర్న్‌బుల్ ఆదివారం ఇక్కడికి చేరుకున్నారు. ఈ పర్యటనలో టర్న్‌బుల్ రక్షణ, భద్రత, ఇంధన, వాణిజ్యం లాంటి కీలక రంగాలపై ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృతస్థాయి చర్చలు జరుపుతారు. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక సహకార ఒప్పందంపై మాత్రం సంతకాలు జరగక పోవచ్చని తెలుస్తోంది.

04/10/2017 - 00:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డిఆర్‌ఐ).. ఆదివారం 15.75 కోట్ల రూపాయల విలువైన పాత 500, 1,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇక్కడి ఝండేవాలా మెట్రో స్టేషన్ సమీపంలోగల నివాస సముదాయాల నుంచి వీటిని డిఆర్‌ఐ సీజ్ చేసింది. తమకు అందిన సమాచారంతో నిర్వహించిన సోదాల్లో రద్దయిన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒక డిఆర్‌ఐ సీనియర్ అధికారి చెప్పారు.

04/09/2017 - 04:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భారత్‌లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన సందర్భంగా శనివారం ఇరు దేశాల మధ్య 22 కీలక ఒప్పందాలు కుదిరాయి. షేక్ హసీనా, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రక్షణ, పౌర అణు సహకారం, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలు వీటిలో ఉన్నాయి, బంగ్లాదేశ్‌కు 50 కోట్ల డాలర్ల రుణం అందించడానికి సంబంధించి కూడా మరో ఒప్పందం కుదిరింది.

04/09/2017 - 04:33

పెట్రాపోల్, ఏప్రిల్ 8: బంగ్లాదేశ్‌లోని ఖుల్నా సిటీ, కోల్‌కతాల మధ్య ప్రయాణికుల రైలు సర్వీసును శనివారం ప్రారంభించారు. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్‌కు రైలు చేరుకోవడంతో ఈ రైలు సర్వీసులు లాంఛనంగా ప్రారంభమైనట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు సంయుక్తంగా న్యూఢిల్లీలో వీడియో లింక్ ద్వారా ఈ రైలు సర్వీసును ప్రారంభించారు.

04/09/2017 - 04:30

లక్నో, ఏప్రిల్ 8: వందేమాతరం పాడబోమంటూ తిరస్కరించటం సంకుచిత బుద్ధికి నిదర్శనమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అన్నారు. ‘‘కొందరు వందేమాతరాన్ని పాడబోమంటూ మాట్లాడుతున్నారు.

04/09/2017 - 04:28

తవాంగ్, ఏప్రిల్ 8: అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్న టిబెటన్ల వౌద్ద గురువు దలైలామా శనివారం తవాంగ్‌లోని బౌద్ గాచోసిన్ బౌద్ధారామంలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

04/09/2017 - 04:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దక్షిణాది వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత తరుణ్ విజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లే ఈ దేశంలో భారతీయులని ఆయన అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘మేము నల్లవాళ్లతో కలిసి జీవిస్తున్నామని తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశమేమిటి?

04/09/2017 - 04:20

ముంబయి, ఏప్రిల్ 8: ఎయిరిండియా నిషేధానికి గురైన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌పై అన్ని విమాన యాన సంస్థలు ప్రయాణానికి అనుమతిస్తూ విమాన యాన సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే గైక్వాడ్ తన దురుసుతనాన్ని మానలేదు.

04/09/2017 - 03:33

చెన్నై, ఏప్రిల్ 8: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కొడుకును తానేనంటూ నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించి ఆమె ఆస్తులకు తానే వారసుడినంటూ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోడ్ నివాసి అయిన 29 ఏళ్ల టి.కృష్ణమూర్తి అనే యువకుడిని డిండిగల్ దగ్గర అరెస్టు చేశారు. తాను జయలలిత, శోభన్‌బాబులకు పుట్టిన సంతానమని.. పుట్టిన వెంటనే తనను దత్తత ఇచ్చారంటూ ఇతను కేసు వేశారు.

Pages