S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/03/2017 - 04:26

న్యూఢిల్లీ, మార్చి 2: కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు సమాచారంతో దేశంలో శాంతి, భద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరోపించారు. గురువారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెంకయ్యనాయుడు ఆ రెండు పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు.

03/03/2017 - 02:51

పట్టుదలను మించిన స్ఫూర్తి ఏదీ ఉండదు.. చదువు కోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ అంగవైకల్యం అడ్డుకాదు.. చేతుల్లేకపోయనా ఇంటర్ పరీక్షను కాళ్లతోనే రాస్తున్న
ఓ విద్యార్ధిని. మహారాష్టల్రో ఓ పరీక్షా కేంద్రంలో దృశ్యమిది.

03/03/2017 - 02:49

కోచ్చి, మార్చి 2: ఖర్చులు తగ్గించుకోవాలనుకునే ప్రభుత్వాలు ముందు గా టార్గెట్ చేసేది సాంస్కృతిక కార్యకలాపాలనేనని, ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు సాంస్కృతిక రంగానికి ప్రభుత్వం మరింత ఎక్కువగా నిధులు కేటాయించాలని ఆయన నొక్కి చెప్పారు.

03/03/2017 - 02:47

రుషీకేశ్, మార్చి 2: ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడానికి సతమతమవుతున్న నేటి పరిస్థితుల్లో యోగా శాశ్వత శాంతికి మార్గాన్ని చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రుషీకేశ్‌లో గంగానది ఒడ్డున ఉన్న పరమార్థ నికేతన్‌లో వారం రోజుల పాటు జరిగే అంతర్జాతీయ యోగా వేడుకలనుద్దేశించి ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

03/03/2017 - 02:45

ఇంఫాల్, మార్చి 2: మణిపూర్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులకు చరమగీతం పాడుతామని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రజలకు హామీ ఇచ్చారు. మణిపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన ఆయన ‘‘మా మొదటి ప్రాధాన్యం చాలాకాలంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభానికి ముగింపు పలకడం, తద్వారా బంద్‌లు, నిర్బంధాలకు స్వస్తి చెప్పటం’’అని షా అన్నారు.

03/03/2017 - 02:43

న్యూఢిల్లీ, మార్చి 2: ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో భారత సైనిక పాటవాన్ని పెంచడానికి సాయుధ బలగాల యాంత్రీకరణలో యుద్ధ విమానయానం భాగం కావాలని ఆర్మీ స్ట్ఫా ఫర్ ప్లానింగ్ అండ్ సిస్టమ్స్ డిప్యూటి చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత సాహా అన్నారు.

03/03/2017 - 02:42

వారణాశి, మార్చి 2: జాతీయ వాదాన్ని ఒక త ప్పుడు పదంగా పరిగణించటం కేవలం భారత దేశం లో మాత్రమే సాధ్యపడిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. గురువారం వారణాశిలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ రామ్‌జాస్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. ‘‘జాతీయవాదం ఒక మంచి పదం. కానీ, దాన్ని తప్పుడు పదంగా మనదేశంలో మాత్రమే పరిగణిస్తారు.

03/03/2017 - 02:39

న్యూఢిల్లీ, మార్చి 2: కేంద్ర ఎన్నికల సంఘం చిన్నపార్టీల కోసం కొత్త గుర్తులను అందుబాటులోకి తెచ్చింది. రాజకీయ పార్టీలుగా నమోదై, ఎన్నికల గుర్తింపులేని పార్టీలకు ‘ఫ్రీ సింబల్స్’ కేటాయిస్తారు. ఈమేరకు 164 కొత్త ఎన్నికల గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలకు రిజర్వ్‌అయిన గుర్తులను మినహాయిస్తూ కొత్తవాటిని ఇస్తారు.

03/03/2017 - 02:38

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రస్తుతం అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో గురువారం మహాధర్నా చేపట్టారు.

03/03/2017 - 02:37

చెన్నై, మార్చి 2: దివంగత జయలలిత మరణానంతరం ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పార్టీ నియమావళి ప్రకారమే అన్నాడి ఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నవనీత కృష్ణన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమె తనంత తానుగా తీసుకోలేదని, చట్ట పరంగా కూడా ఆమె నియామకంపై ఎలాంటి సమస్యలు లేరని, పార్టీ అధినేత్రిగా చిన్నమ్మే కొనసాగుతారని ఆయన అన్నారు.

Pages