S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/03/2017 - 01:33

కొచ్చి, మార్చి 2: భారత దేశంలో అసహనానికి తావులేదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. విద్యా బోధన చేసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే వర్శిటీలు అశాంతి సంస్కృతికి వేదికలు కాకూడదని హెచ్చరించారు.

03/02/2017 - 08:30

ముంబయి, మార్చి 1: ప్రపంచంలో సూపర్‌రిచ్ సిటీల్లో వాషింగ్టన్, టొరొంటోలను అధిగమించి ముంబయి 21వ ర్యాంక్ సాధించింది. రియల్ ఎస్టేట్ దిగ్గజం నైట్ ఫ్రాంక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 125 నగరాలపై అధ్యయనం చేసి ఓ జాబితా రూపొందించింది. మొత్తం 89 దేశాల్లోని సూపర్ రిచ్ సిటీల్లో సర్వే జరిగింది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు 2017 ప్రకారం వాషింగ్టన్ డిసి, టొరొంటో నగరాలను ముంబయి దాటిపోయింది.

03/02/2017 - 08:28

పాట్నా, మార్చి 1: పెద్దనోట్లను రద్దుచేసిన ప్రధాని నరేంద్ర మోదీని జనం చెప్పులతో కొట్టాలని మంత్రి చేసిన వ్యాఖలు బిహార్ అసెంబ్లీని కుదిపేశాయి. కాంగ్రెస్ మంత్రి ఇస్తేర్ అబ్దుల్ జలీల్ మస్తాన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బిజెపి సభ్యులు డిమాండ్ చేశారు. మస్తాన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని సభలో నిరసన తెలిపారు. మంగళవారం స్థానిక టీవీలో ప్రధాని మోదీపై మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

03/02/2017 - 08:27

మహరాజ్‌గంజ్/దేవోరియా, మార్చి 1: పెద్దనోట్ల రద్దుపై నానా రాద్ధాంతం చేసిన ఆర్థికవేత్తలు తాజా జిడిపి నివేదికకు ఏం సమాధానం చెబుతారని ప్రధాని నరేంద్ర మోదీ నిలదీశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం జిడిపిపై ఏమాత్రం లేదని తాజా గణాంకాల్లో తేలిపోయిందని బుధవారం ఇక్కడ చెప్పారు. హార్డ్‌వర్క్ హార్వర్డ్ కంటే శక్తివంతమైందని మోదీ అన్నారు.

03/02/2017 - 08:27

లక్నో, మార్చి 1: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం నేతకు కూడా టిక్కెట్ ఇవ్వకపోవటం ద్వారా భారతీయ జనతా పార్టీ తప్పటడుగు వేసిందా? పార్టీ సీనియర్ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత అయిదేళ్లలో పార్టీ మైనార్టీ సెల్ విభాగం ముస్లింలను దగ్గర చేసుకోవటానికి నిరంతరం పనిచేసింది. ముస్లిం ఓటర్లతో, మత పెద్దలతో, నాయకులతో సత్సంబంధాలు నెరిపింది.

03/02/2017 - 08:26

ముంబై, మార్చి 1: అత్యాచార బాధితులు బిచ్చగాళ్లు కారని, వారికి పరిహారం ఇవ్వటం ప్రభుత్వ బాధ్యతే తప్ప ఏ చారిటీదో కాదని బాంబే హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది.

03/02/2017 - 08:32

బాలాసోర్/న్యూఢిల్లీ, మార్చి 1: శత్రు క్షిపణులను మార్గం మధ్యలోనే తుత్తునియలు చేసే సామర్థ్యం కలిగిన సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతిక విజ్ఞానంతో రూపొందించిన క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత దేశ బాలిస్టిక్ క్షిపణి రక్షణకు మరింత బలం చేకూరినట్టయిందని అధికార వర్గాలు తెలిపాయి.

03/02/2017 - 05:10

న్యూఢిల్లీ, మార్చి 1: దేశంలో మరో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మొత్తం పది ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది.

03/02/2017 - 05:05

న్యూఢిల్లీ, మార్చి 1: సబ్సిడీ యేతర ఎల్‌పిజి రేట్లు 86రూపాయలు పెరిగాయి. వినియోగదారుల కోటా పూర్తయిన తర్వాత సరఫరా చేసే అదనపు గ్యాస్ సిలెండర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా నాన్ సబ్సిడీ గ్యాస్ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పిజి రేటు 737.50పైసల మేర ఉంది. దీనికి అదనంగా 86రూపాయలు చేరుతుంది.

03/02/2017 - 05:00

న్యూఢిల్లీ, మార్చి 1: రద్దయిన పాత నోట్లు దగ్గర ఉంటే రూ.10వేల జరిమానా వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. స్పెసిఫైడ్ బ్యాంక్స్ నోట్స్ చట్టం-2017ను పార్లమెంట్ గత నెలలో ఆమోదించిన సంగతి తెలిసిందే. రద్దయిన పాతనోట్లు రూ.500, రూ.

Pages