S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/01/2017 - 04:48

కాశ్మీర్ యువత, పిల్లలతో ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలో ముచ్చటిస్తున్న దృశ్యం..
వందమందికి పైగా ఉన్న ఈ బృందం దేశ వ్యాప్తంగా పర్యటిస్తోంది.

03/01/2017 - 04:42

లండన్, ఫిబ్రవరి 28: బ్యాంకు రుణాల ఎగవేతదారులను వదిలిపెట్టేదిలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న జైట్లీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అంశాన్ని లేవనెత్తే అవకాశాలున్నాయి. ‘ఈ అవకాశాన్ని కచ్చితంగా వినియోగించుకుంటాం. రుణాలు తీసుకుని ఎగవేసి తప్పించుకుతిరుగుతున్నవారి విషయంలో కఠినంగానే ఉన్నాం.

03/01/2017 - 04:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగటంతో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలతోపాటు చెక్ క్లియరెన్స్‌లు కూడా నిలిచిపోయాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.

03/01/2017 - 04:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్‌ను మోకాలి శస్తచ్రికిత్స నిమిత్తం కెనడాకు తరలించారు. కొద్ది రోజులుగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల శస్తచ్రికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కెనడాకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఖాదర్ ఖాన్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు.

03/01/2017 - 04:34

ఇంఫాల్, ఫిబ్రవరి 28: నాగా ఒప్పందంలో ఏముందో బహిర్గం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసిన నాగా ఒప్పందంపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారని మంగళవారం ఇక్కడ ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం నాగా ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో ఏముందో ఎవరికీ తెలియదు.

03/01/2017 - 04:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పట్టణీకరణ సంస్కరణలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పట్టణ అభివృద్ధి విభాగాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇంక ఎంతమాత్రం జాప్యం జరగడానికి వీలులేదని మంగళవారం జరిగిన సదస్సులో స్పష్టం చేశారు. పట్టణ పాలన, ప్రణాళిక, ఫైనాన్సింగ్ అన్నవి మొత్తం ఈ మార్పుల ప్రక్రియలో అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

03/01/2017 - 04:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇరవై ఆరు వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలన్న ఓ మహిళ అభ్యర్థనను మంగళవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. తన గర్భంలో శిశువుకు జన్యుపరమైన లోపాలున్నట్లుగా వైద్యులు గుర్తించినందున గర్భస్రావానికి అనుమతించాలని 37 ఏళ్ల ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ మెడికల్ బోర్డు సలహాను కోరింది.

03/01/2017 - 04:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాల నివృత్తికి దర్యాప్తు చేయించాలని అన్నాడిఎంకె ఎంపీ వి మైత్రేయన్ విజ్ఞప్తి చేశారు. మైత్రేయన్ మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ మేరకు కోరారు. రాష్టప్రతిని కలిసిన అనంతరం రాష్టప్రతి భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ జయ మృతిపై అనేక అనుమానాలున్నాయని అన్నారు.

03/01/2017 - 04:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: స్వేచ్ఛా గళాలను నొక్కివేస్తున్నారంటూ వేలాది మంది ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధులు, అధ్యాపకులు మంగళవారం ఎబివిపికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ జరిపారు. తనపై అత్యాచారం జరుపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ప్రకటించి సంచలనం రేపిన గుర్‌మెహర్ కౌర్ ఎబివిపికి వ్యతిరేకంగా తన నిరసనను విరమించుకున్నారు. నేటి ర్యాలీలో పాల్గొనని గుర్‌మెహర్ ‘నన్ను వదిలేయండి’ అంటూ అభ్యర్థించారు.

03/01/2017 - 04:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తాల్లోకెక్కే బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్ ముస్లింలపై మరోసారి కొత్తరకం వ్యాఖ్యలతో తాజా చర్చకు తెరతీశారు. దేశంలో ముస్లింల సంఖ్య దాదాపు 20 కోట్లకు చేరుకుందని, వీరందరినీ ఖననం చేయడానికి దేశంలో స్థలం ఎక్కడుందని, అందుకే చనిపోయిన ముస్లింలను కూడా దహనం చేయాలని వ్యాఖ్యానించారు.

Pages