S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/27/2017 - 02:51

రంగ్‌చపర (అస్సాం), ఫిబ్రవరి 26: ఇప్పటికే బహిరంగ మల, మూత్ర విసర్జనతో పాటు మద్యం, పొగాకు, మాదకద్రవ్యాల నుంచి విముక్తి పొందిన విశిష్ట గ్రామంగా రికార్డు సృష్టించిన అస్సాంలోని రంగ్‌చపర ఇప్పుడు నగదు రహిత గ్రామంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోల్‌పర జిల్లాలోని ఈ గ్రామంలో గత 17 ఏళ్లలో ఎలాంటి చిన్న నేర సంఘటన జరగకపోవడం విశేషం.

02/27/2017 - 02:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తమిళనాడు, కర్ణాటక పోలీసులను, అటవీ శాఖ సిబ్బందిని కొనే్నళ్లపాటు ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్.. తనను వేటాడుతున్న తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సిబ్బంది అందరినీ గుర్తించగలిగేవాడట. అదెలాగంటే, వారి స్వరాన్ని విని సదరు వ్యక్తిని గుర్తుపట్టేవాడట.

02/27/2017 - 02:08

ముంబై, ఫిబ్రవరి 26: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ ‘యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్’ను అందుకున్నారు. శనివారం ముంబైలో కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో షారుఖ్ ఖాన్‌కు టి.సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డును అందజేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు, ప్రముఖ నటి రేఖ, శతృఘ్న సిన్హా, మాధురీ దీక్షిత్, జయప్రద, పద్మినీ కొల్హాపురి తదితరులు ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్‌ను ఘనంగా సత్కరించారు.

02/27/2017 - 01:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: నగదు రహిత లావాదేవీలతో నల్లధనాన్ని అదుపు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛతా ఉద్యమంలో భాగంగా యువత అవినీతి వ్యతిరేక సైన్యంగా తయారు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోద్వారా ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

02/27/2017 - 01:22

మదురై, ఫిబ్రవరి 26: తమిళనాడులో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ బోటు ప్రమాదంలో తొమ్మిది మంది యాత్రికులు దుర్మరణం చెందారు. ట్యుటికోరన్ జిల్లా మనపాడ్ సమీపంలో వీరు ప్రయాణం చేస్తున్న పడవ తలకిందులు కావటంతో ఈ దుర్ఘటన జరిగింది. రంగంలోకి దిగిన సహాయ బృందాలు పదిమందిని రక్షించగలిగాయి. మిగతావారికోసం గాలింపు జరుగుతోంది.

02/27/2017 - 01:15

న్యూఢిల్లీ/ఏలూరు, ఫిబ్రవరి 26:దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చెర నుంచి విముక్తమైన తెలుగు డాక్టర్ కోసనం రామ్మూర్తి తాను అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన రామ్మూర్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు 2015 సెప్టెంబర్ 15న లిబియాలో కిడ్నాప్ చేశారు.

02/26/2017 - 03:23

ముంబయి, ఫిబ్రవరి 25: బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని విషయం తెలిసిందే. అయినప్పటికీ మేయర్ పదవి తమ పార్టీకే దక్కుతుందని అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన ధీమా వ్యక్తం చేసింది. మద్దతుకోసం తాము కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తోసిపుచ్చారు.

02/26/2017 - 02:59

లక్నో, ఫిబ్రవరి 25: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదో విడత ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. 51 నియోజకవర్గాల్లో ప్రచారం తార స్థాయిలో సాగింది. కాదేదీ అనర్హం అన్నట్టు గాడిద, కసబ్, పావురాలను ప్రచార అస్త్రాలుగా వాడుకున్నారు. తూర్పు యూపీలోని 11 జిల్లాల పరిధిలో పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఆకట్టుకోడానికి పార్టీలు విశ్వప్రయత్నం చేశాయి.

02/26/2017 - 02:59

అంబేద్కర్‌నగర్ (యూపీ), ఫిబ్రవరి 25: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల పొత్తు రెండు అవినీతి కుటుంబాల మధ్య ఒప్పందంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అభివర్ణించారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు.

02/26/2017 - 02:58

సిద్ధార్థనగర్ (యూపి), ఫిబ్రవరి 25: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రాకుండా బిజెపి, బిఎస్పీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. సిద్ధార్థనగర్ ఎన్నికల సభలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజలను బిజెపి తప్పుదోవపట్టిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్‌పిని అడ్డుకునేందుకు ఏ క్షణమైనా బిజెపితో మయావతి జతకలిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

Pages