S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/18/2017 - 01:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంలో పనిచేయడానికి తెలంగాణతో ఇంకా ఒప్పందం కుదరలేదని, దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని రైల్వేబోర్డు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయంలో రైల్వేబోర్డు అధికారులు శుక్రవారం నాడు విలేఖరులతో మాట్లాడారు.

02/18/2017 - 01:55

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఇకపై దేశంలోని పారిశ్రామిక సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు చెక్కులు లేదా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడం ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వేతనాల చెల్లింపు( సవరణ) చట్టం-2017కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆమోదముద్ర వేశారు.

02/18/2017 - 01:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘కనీస ప్రభుత్వం గరిష్ఠ పరిపాలన’ సూత్రానికి అనుగుణంగా పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలను విలీనం చేయటం, సంస్కరించటం ద్వారా ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒక అంశం పరిధిలోని పలు శాఖలను విలీనం చేయటం ద్వారా ప్రభుత్వ పరిమాణాన్ని కుదించాలని ప్రధాని ఆలోచిస్తున్నారు.

02/18/2017 - 01:05

చెన్నై, ఫిబ్రవరి 17: పళనిస్వామి విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేస్తుందని ప్రతిపక్ష డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ స్పష్టం చేశారు. హైకమాండ్ ఆదేశానుసారమే తాము వ్యవహరిస్తామని ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు కలిగిన కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 1988లో కూడా అన్నాడిఎంకె పార్టీలో ఈ రకమైన వారసత్వ పోరే తలెత్తింది.

02/18/2017 - 01:28

చెన్నై, ఫిబ్రవరి 17: గత కొన్ని వారాలుగా తమిళనాడును అట్టుడికించిన రాజకీయ అనిశ్చితి, సంక్షోభం నేడు నిర్ణయాత్మక దశకు చేరుకోనున్నాయి. రాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు నిర్ణయంతో ముఖ్యమంత్రిగా నియమితులైన అన్నాడిఎంకె నాయకుడు పళనిస్వామి అత్యంత కీలకమైన బలపరీక్షను శనివారం అసెంబ్లీలో ఎదుర్కోనున్నారు.

02/17/2017 - 04:11

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 16: హర్యానాలోగల బిఎంఎల్ ముంజాల్ యూనివర్శిటీలో చదువుతున్న ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మణిదీప్ రంగా బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బిఎంఎల్ ముంజాల్ యూనివర్శిటీలో మణిదీప్ బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల్లో మణిదీప్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

02/17/2017 - 03:05

చెన్నై, ఫిబ్రవరి 16: తమిళనాడులో జయలలిత పాలన పునరుద్ధరణ అయ్యేంతవరకు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబంపై పోరాటం కొనసాగిస్తామని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. ‘పార్టీ, ప్రభుత్వం తిరిగి ఒకే కుటుంబం చేతిలోకి వెళ్లకుండా మేమంతా కలిసికట్టుగా అడ్డుకుంటాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం.

02/17/2017 - 03:03

చెన్నై, ఫిబ్రవరి 16: జయలలిత మరణానంతరం అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన శశికళపై అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నాటకీయ తిరుగుబాటు చేయడం, జయ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా ప్రకటించడంతో హటాత్తుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా సెంగొట్టియన్‌తో పాటుగా తెరపైకి వచ్చిన ఎడప్పాడి పళనిస్వామి గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.

02/17/2017 - 02:57

మైన్‌పురి (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 16: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు తనపై విమర్శలు కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఎదురుదాడికి దిగారు. తనకు అనుభవం లేకపోవడంవల్ల కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టానని మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

02/17/2017 - 02:56

కాన్పూర్, ఫిబ్రవరి 16: ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, మిగతా లౌకిక పార్టీలు కూడా ఈ కూటమిలో చేరుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) కూడా ఈ మహాకూటమిలో చేరుతుందా?

Pages