S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/20/2017 - 03:22

కన్నూర్, జనవరి 19: కేరళలోని కన్నూర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల దాడిలో బిజెపి కార్యకర్త మృతి చెందడంతో జిల్లా అట్టుడికి పోతోంది. కాగా, గురువారం ఉదయం తాలిపరంబ సమీపంలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై నాటుబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు కానీ, ఆఫీసు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి.

01/20/2017 - 03:21

లక్నో, జనవరి 19: వచ్చే నెల 15న జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంనుంచి ప్రారంభం కానుంది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే పశ్చిమ యుపిలోని 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం జారీ కానుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 27 దాకా కొనసాగుతుంది.

01/20/2017 - 03:21

న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా రాష్ట్రాల్లో విజయం సాధించబోతోందనడానికి సంకేతాలని ఆ పార్టీ గురువారం వ్యాఖ్యానించింది.

01/20/2017 - 03:20

న్యూఢిల్లీ, జనవరి 19: 2012లో కేంద్ర బడ్జెట్‌ను ఆలస్యంగా సమర్పించినప్పుడు ప్రభుత్వం పాటించిన విధి విధానాలతో పాటుగా దీనికి సంబంధించి తాజా వివరాలను తెలియజేయాలని ఎన్నికల కమిషన్ క్యాబినెట్ సెక్రటేరియట్‌ను కోరింది. శుక్రవారం ఉదయానికల్లా ఈ వివరాలను తెలియజేయాలని క్యాబినెట్ సెక్రటేరియట్‌కు బుధవారం రాసిన తాజా లేఖలో ఇసి కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

01/20/2017 - 03:19

న్యూఢిల్లీ, జనవరి 19: కాశ్మీర్ వేర్పాటువాది, హురియత్ నేత సయ్యద్ అలి షా గిలానీకి సంబంధించిన ఐదు బ్యాంకు అకౌంట్ ఖాతాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిశీలిస్తోంది. వీటిలో రెండు గిలానీ వ్యక్తిగత ఖాతాలు కాగా, మిగిలిన మూడు ఖాతాలు ఇతరులతో సంబంధాలు కలిగివున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 2014-15లో ఈ ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.

01/20/2017 - 03:09

చింతూరు, జనవరి 19: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు పేలడంతో ఒక బాలిక సహా ముగ్గురు మహిళలు మృతిచెందారు.

01/20/2017 - 02:57

న్యూఢిల్లీ, జనవరి 19:ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు పంపిన ఫైల్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేసి రాష్టప్రతి ఆమోదం కోసం పంపాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధుల బృందం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

01/20/2017 - 02:54

హైదరాబాద్, జనవరి 19: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హజ్రత్ నిజాముద్దీన్-కొచువెలి మధ్య 42 ఏసి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ట్రైన్ నెం.

01/20/2017 - 02:51

న్యూఢిల్లీ, జనవరి 19: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2017-18) సంబంధించి త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆ శాఖకు చెందిన ఇతర ఉద్యోగులు గురువారం ‘హల్వా ఉత్సవం’లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

01/20/2017 - 01:23

న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మను సిబి ఐ కొత్త డైరెక్టర్‌గా నియమిస్తూ గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖెహర్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య కమిటీ అలోక్ కుమార్ పేరును ఆమోదించింది.

Pages