S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/20/2017 - 01:21

న్యూఢిల్లీ/చెన్నై, జనవరి 19:జల్లికట్టుపై తమిళనాడు అట్టుడుకుతోంది. తమ ప్రాచీన సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ చేపట్టిన దీక్షలు మూడోరోజు గురువారమూ కొనసాగాయి. తమిళ సంఘాలు శుక్రవారం రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు డిఎంకె సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా జల్లికట్టుకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ గురువారం బంద్ పాటించింది. షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి.

01/19/2017 - 08:26

చెన్నై, జనవరి 18: జల్లికట్టు నిషేధాన్ని నిరసిస్తూ తమిళనాట ఉద్యమాలు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జల్లికట్టు తమిళుల ఆత్మగౌరవమని వేలాది సంవత్సరాలుగా తమిళ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వచ్చిందని మెరీనా బీచ్‌కు వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు నినదించారు. బుధవారం మెరీనా బీచ్ అంతాకూడా నినాదాలతో మారుమోగడంతో పాటు వెంటనే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్లు మిన్నంటాయి.

01/19/2017 - 08:28

న్యూఢిల్లీ, జనవరి 18: దేశంలో లభించే అన్ని రకాల ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల పోషకాహార విలువలను తెలియజేసే యాప్ సిద్ధమవుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) రూపొందించిన ఇండియన్ ఫుడ్ కాంపోజీషన్ టేబుల్స్ (్భరత ఆహార పట్టికల కూర్పు) పుస్తకాన్ని నడ్డా బుధవారం ఐఎంఆర్ సమావేశంలో ఆవిష్కరించారు.

01/19/2017 - 08:25

న్యూఢిల్లీ, జనవరి 18: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్‌లో అస్సాం తీర్పు పునరావృతమవుతుందా? అస్సాంలో ఎన్నికలకు ముందు బిజెపి అనుసరించిన వ్యూహానే్న ఉత్తరాఖండ్‌లోనూ ఆ పార్టీ అమలు చేస్తోంది. అస్సాంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ఆయువుపట్టుగా నిలిచిన సీనియర్ నేతలు హిమంత బిశ్వ శర్మతో సహా పలువురు కమలం వైపు దూకడం ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది.

01/19/2017 - 08:24

న్యూఢిల్లీ, జనవరి 18: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ అనివార్యం కావటంతో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లకు ఊపిరాడటం లేదు. నలభై సీట్లున్న గోవా శాసనసభకు ఫిబ్రవరి నాలుగో తేదీన పోలింగ్ జరుగుతుంది. బిజెపి, కాంగ్రెస్, మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీ, గోవా సురక్షా సమితి కూటమితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగటంతో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

01/19/2017 - 07:56

న్యూఢిల్లీ, జనవరి 18: అనాధ పిల్లలకు చదువుకునే, వైద్య సేవల్ని పొందే హక్కును కల్పించడంలో భాగంగా వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అనాధ పిల్లల పునరావాసం, హక్కుల కల్పనకు ఉద్దేశించిన ఈ పథకాన్ని త్వరలోనే మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఆరోగ్య బీమా, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పరమైన వెసులుబాటును కూడా వీరికి కల్పించాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు.

01/19/2017 - 07:43

జోధ్‌పూర్, జనవరి 18: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టులో పెద్ద ఊరట లభించింది. 18 ఏళ్లనాటి కృష్ణ జింకల వేట ఘటనలో సల్మాన్‌పై మోపిన ఆయుధాల చట్టం కేసులో రాజస్థాన్ కోర్టు ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అతడిపై చేసిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని బుధవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో 102 పేజీల తీర్పును చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ దల్పత్‌సింగ్ చదివి వినిపించారు.

01/19/2017 - 07:38

న్యూఢిల్లీ, జనవరి 18: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పార్లమెంట్ స్థారుూ సంఘం సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

01/19/2017 - 07:38

న్యూఢిల్లీ, జనవరి 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యం లో బ్యాంకింగ్ వ్యవస్థలో మామూలు పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయన్న దానిపై ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోయారు. అయితే రద్దయిన కరెన్సీలో 60శాతం మొత్తాన్ని అంటే 9.2లక్షల కోట్ల మేర కొత్త నోట్లతో భర్తీ చేయగలిగామని తెలిపారు.

01/19/2017 - 07:36

న్యూఢిల్లీ, జనవరి 18: మరో వారంలో గణతంత్ర వేడుకలు జరుగనున్న దృష్ట్యా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో సైనిక దుస్తుల్లో ఏడుగురు మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం సృష్టించాయి. దీనితో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించి భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

Pages