S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/06/2016 - 18:18

అస్సాం: బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు అస్సాంలో పొంగిపొరలుతున్నాయి. మోరిగావ్‌ జిల్లాలో వరద ప్రాంతాల్లోని ప్రజలను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లఖింపూర్‌ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఏడు పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలను తరలిస్తోంది. దాదాపు వంద గ్రామాలు నీట మునిగాయి. 7 జిల్లాల్లో దాదాపు 88వేల మంది ప్రజలు ఈ వరదల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు.

07/06/2016 - 16:13

దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, తదనంతర పరిణామాల వల్లే కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీని జౌళి, చేనేత శాఖకు మార్చారని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం నేత కన్నయ్య బుధవారం వ్యాఖ్యానించారు. ఆమెకు శాఖ మార్చడం శిక్ష కాదని, రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగినట్టు కాదని అన్నారు.

07/06/2016 - 15:28

గయ : బీహార్‌లోని గయలో పిడుగుపాటుకు బుధవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వర్షాలకు బీహార్‌లో పలు గ్రామాలు నీట మునిగాయి.

07/06/2016 - 15:26

అసోం : ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నందన ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అసోం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. బ్రహ్మపుత్ర నదిలో మరబోట్ల సాయంతో గస్తీ తీవ్రతరం చేశారు. అసోం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి బీఎస్‌ఎఫ్‌ బలగాలను తరలిస్తున్నారు.

07/06/2016 - 15:24

చెన్నై: రెండంతస్థుల భవనం నుంచి కుక్కను కింద పడేసిన వైద్యవిద్యార్థి ఎస్‌.గౌతమ్‌ను, వీడియో తీసిన వ్యక్తిని చెన్నై పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. గౌతమ్‌ ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్‌ కుక్కపిల్లను కిందపడేస్తుండగా వీడియో తీసిన ఆశిశ్‌ పాల్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

07/06/2016 - 14:11

దిల్లీ: అవినీతిని అడ్డుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పదే పదే చెప్పే దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమార్కులకు అండగా నిలిచారని బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారిని సిబిఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేశారు.

07/06/2016 - 12:57

దిల్లీ : వాటర్ మీటర్ల కుంభకోణంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ. 341 కోట్ల వాటర్ మీటర్ల అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

07/06/2016 - 12:46

శ్రీనగర్‌: కశ్మీర్‌ పండిట్లకు సైనిక కాలనీ ఏర్పాటుకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్ బుధవారం ఆందోళనకు దిగింది. పాకిస్తాన్, ఐసీస్‌ జెండాలతో ఆందోళనకు దిగారు. ఆర్మీ జవాన్లపై రాల్లు రువ్వారు. దీంతో శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై జవాన్లు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

07/06/2016 - 12:12

దిల్లీ: ప్రపంచ దేశాలతో పోటీపడేలా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా పదోన్నతి పొందిన ప్రకాష్ జవదేకర్ అన్నారు. శాఖ మారిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేలా విద్యారంగాన్ని మార్చాల్సి ఉందన్నారు.

07/06/2016 - 11:29

పూరీ : బుధవారం పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు, బలరామదేవుడు, సుభద్ర విగ్రహాలను ఘనంగా నరగ వీథుల్లో ఊరేగిస్తున్నారు. యాత్రను తిలకించేందుకు భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆషాఢ శుక్ల విదియనాడు ప్రారంభమయ్యే యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది. 9వ రోజున ప్రధాన ఆలయానికి చేరుకుంటుంది.

Pages