S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/16/2017 - 02:06

న్యూఢిల్లీ, జనవరి 15: సిబిఐ చీఫ్‌ను నిర్ణయించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశం కానుంది. గత డిసెంబర్ 2న అనిల్ సిన్హా రిటైరయినప్పటినుంచి నెల రోజులకు పైగా సిబిఐ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి రాకేశ్ ఆస్తానా తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నారు.

01/16/2017 - 02:05

న్యూఢిల్లీ, జనవరి 15: కోర్టులో వ్యాజ్యం అంటేనే ఇప్పట్లో తెగదులే అనే భావన నెలకొని ఉంది. దశాబ్దం దాటిన కేసులు దేశంలో వేలల్లో ఉన్నాయి. అయితే అతి పురాతనమైన వ్యాజ్యాలలో ఒకటయిన ఒక ఆస్తుల కేసు సుమారు అయిదు దశాబ్దాల తరువాత ఎట్టకేలకు పరిష్కారమయింది. ఎవరి వాటా ఎంతో తేల్చిన ఢిల్లీలోని ఓ కోర్టు వాటికి అనుగుణంగా మూడు భవనాలను పరస్పర అంగీకారంతో విభజించుకోవాలని కక్షిదారులకు సూచించింది.

01/16/2017 - 02:05

లక్నో, జనవరి 15: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్-సమాజ్‌వాది పార్టీ కూటమికి కానీ, సమైక్య ఎస్పీకి లేవని, ఒక బిఎస్పీకి మాత్రమే ఉందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ‘ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కానీ లేదా సమైక్య సమాజ్‌వాది పార్టీ కానీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేవు.

01/16/2017 - 02:03

లక్నో, జనవరి 15: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీలో విభేదాలు తలెత్తడం, కుమారుడు అఖిలేష్ యాదవ్ దూరం కావడంతో దాదాపుగా ఒంటరై పోయి పార్టీ గుర్తు సైకిల్‌కోసం పోరాడుతున్న ములాయం సింగ్‌కు అనుకోని ఆఫర్ లభించింది.

01/16/2017 - 02:02

న్యూఢిల్లీ, జనవరి 15: ఉస్మానియా యూనివర్శిటీలో సుదీర్ఘకాలం అధ్యాపకుడిగా పని చేసిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి, ప్రభుత్వ విధానంలో ప్రొఫెసర్ అయిన సుష్మా యాదవ్‌లను యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్‌లో సభ్యులుగా నియమించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

01/16/2017 - 02:01

మదురై, జనవరి 15: జల్లికట్టు నిషేధంపై తమిళనాడులో ఆదివారం కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. పలుజిల్లాల్లో బంద్ కొనసాగింది. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జల్లికట్టును నిర్వహించేందుకు ప్రయత్నించారు. ముదకతన్, అలంగనలూర్, పలమేడు, వైలాంగుడి ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణకు ప్రయత్నించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. డిండిగల్ జిల్లాలో కూడా పలుచోట్ల అరెస్టులు జరిగాయి.

01/16/2017 - 02:01

న్యూఢిల్లీ, జనవరి 15: రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం సిద్ధూ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ గత ఏడాది నవంబర్‌లోనే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో సిద్ధూ కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు నిజమయ్యాయి.

01/16/2017 - 01:59

పాట్నా, జనవరి 15: గంగానదిలో పడవ మునగడంతో మృతి చెందిన మరో నలుగురి మృతదేహాలను సహాయక బృందాలు ఆదివారం వెలికితీశాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 24కు పెరిగింది. మకర సంక్రాంతిని పురస్కరించుకొని బిహార్ రాష్ట్ర పర్యాటక శాఖ శనివారం ప్రారంభించిన పతంగుల పండుగకు హాజరై సాయంత్రం తిరిగివస్తున్న సమయంలో ఎన్‌ఐటి ఘాట్ వద్ద ఈ పడవ మునిగిపోయింది.

01/16/2017 - 01:55

చెన్నై, జనవరి 15: ప్రజలకు తమ రోజువారీ జీవితంలో మరింత హాస్యం, వ్యంగ్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసిక ఒత్తిడి నుంచి మనిషిని బయటికి తీసుకురావడానికి, స్వస్థత చేకూర్చడానికి ఉత్తమ ఔషధం హాస్యమని ఆయన పేర్కొన్నారు. చిరునవ్వు లేదా నవ్వు.. తిట్టు లేదా మరే ఆయుధం కన్నా శక్తివంతమైనదని ఆయన అన్నారు.

01/16/2017 - 01:19

న్యూఢిల్లీ, జనవరి 15: భారత జవానులు తమకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని నిర్దిష్ట అధికారికి, వ్యవస్థకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు పోస్ట్ చేస్తే వారు శిక్షార్హులని భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. ఆర్మీడే ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సైన్యంలో ఏ ఒక్క జవాను అయినా తనకు సమస్య వస్తే పరిష్కరించటానికి ప్రత్యేక వ్యవస్థ ఉంది.

Pages