S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/14/2017 - 01:44

చెన్నై, జనవరి 13: జల్లికట్టుపై నిషేధానికి వ్యతిరేకంగా తమిళనాడు అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంపై శుక్రవారం ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె రాష్టవ్య్రాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

01/14/2017 - 01:43

న్యూఢిల్లీ, జనవరి 13: దేశ వ్యాప్తం గా వివిధ హైకోర్టుల్లో తీవ్రమైన న్యాయమూర్తుల కొరత వల్ల పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 24 హైకోర్టుల్లో కలిపి మొత్తం 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. 24 హైకోర్టులు సుమారు 44 శాతం న్యాయమూర్తుల కొరతతో నడుస్తున్నాయి.

01/14/2017 - 01:41

జోధ్‌పూర్, జనవరి 13: కృష్ణ జింకను వేటాడిన కేసులో వాంగ్మూలాలను న మోదు చేసేందుకు ఈ నెల 25న న్యాయస్థానంలో హాజరు కావలసిందిగా జోధ్‌పూర్ కోర్టు శుక్రవారం బాలీవుడ్ నటు లు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం, టాబులను ఆదేశించింది. 1998నాటి ఈ కేసులో కోర్టులో ప్రవేశపెట్టిన అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తరువాత చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దల్పత్ సింగ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

01/14/2017 - 01:39

కోల్‌కతా, జనవరి 13: కోల్‌కతాలో శనివారం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమం నిర్వహణకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. నగరం మధ్యలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కొన్ని ఆంక్షలతో నిర్వహించుకోవచ్చని న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యో బాగ్చి చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్య 4 వేలకు మించకూడదనేది ఆ ఆంక్షల్లో ఒకటి.

01/14/2017 - 02:55

న్యూఢిల్లీ, జనవరి 13: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు(సర్జికల్ స్ట్రైక్స్)కు ప్రతీకారంగా తాము కూడా నియంత్రణ రేఖ దాటి వెళ్లి అఖ్నూర్ ఆర్మీ క్యాం ప్‌పై దాడి చేసి 30 మంది భారతీయ సైనికులను చంపేశామని జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ చెప్పుకొన్నాడు. ఈ మేరకు ఒక వీడియో టేప్‌ను సైతం విడుదల చేశాడు.

01/14/2017 - 01:05

న్యూఢిల్లీ, జనవరి 13:ఉత్తర ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తును ఎవరికి కేటాయించాలన్నదానిపై ఎన్నికల సంఘం తన తీర్పును వాయిదా వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ వర్గాల వాదనలను విన్న అనంతరం శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. సరైన సమయంలోనే తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది.

01/14/2017 - 02:53

మహాత్మా గాంధీ ఫొటేనే లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ఖాదీ, గ్రామ పరిశ్రమల
కార్పొరేషన్ (కెవిఐసి) ముద్రించిన కాలెండర్ రాజకీయ దుమారం రేపుతోంది. మహాత్ముడి ఫొటో లేకపోవడం అపచారమని పశ్చిమ బెంగాల్ సిఎం మమత, ఖాదీ తన ఘనతేనని మోదీ చెప్పుకుంటున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ధ్వజమెత్తారుః

01/14/2017 - 00:51

న్యూఢిల్లీ, జనవరి 13: విభజన చట్టం 10వ షెడ్యూల్‌లోని 107 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపకాలపై కేంద్రం వద్ద జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర సీనియర్ అధికారులతో హోంశాఖ అదనపుకార్యదర్శి జయదీప్ గోవింద్ జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. అవిభాజిత రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పులు, నగదును జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

01/14/2017 - 00:49

సీలేరు / భద్రాచలం, జనవరి 13: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఐదుగురు ప్రభుత్వ అధికారులను శుక్రవారం ఉదయం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పరిధిలో గల జోడాం, పొనపొదార్ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒడిశా అధికారుల బృందం ఆ గ్రామ పంచాయతీలకు శుక్రవారం ఉదయం చేరుకుంది.

01/13/2017 - 04:18

విజయవాడ, జనవరి 12: చెన్నైకు నీళ్లిచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. నీటి లభ్యత, స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని చెన్నైకి నీటి సరఫరా విషయమై తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. తిరుపతిలో త్వరలో ఉన్నతాధికారుల స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు.

Pages