S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/10/2017 - 02:27

న్యూఢిల్లీ, జనవరి 9: కతార్‌లో మరణదండనకు గురైన ఇద్దరు తమిళులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారి తరపున ఖతార్ సుప్రీం కోర్టులో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఒక మహిళను హత్య చేసిన కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించి మరణదండన విధించింది.

01/10/2017 - 02:26

న్యూఢిల్లీ, జనవరి 9: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఆజ్‌మన్‌లో వ్యాపార ఓడల్లో 41మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారని సుష్మా తెలిపారు. వీరికి అవసరమైన పదార్థాలు సరఫరా చేయాలని, సౌకర్యాలు కల్పించాలని యుఏఈ లోని దౌత్య కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. నాలుగు వాణిజ్య ఓడల్లో 41మంది భారతీయులు పనిచేస్తున్నారని వీటిలో రెండు ఓడలు లీక్ అవుతున్నాయని, మునిగిపోయే స్థితిలో ఉన్నాయని ఆమె తెలిపారు.

01/10/2017 - 02:26

చెన్నై, జనవరి 9: కావేరీ నదీ జలాల వివాదం కొత్త మలుపు తిరిగింది. కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోనందున కర్నాటకనుంచి రూ.2,480 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని తమిళనాడు డిమాండ్ చేసింది. కావేరీ వివాదానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఇవ్వాలని తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలకు వారం గడువు ఇచ్చింది.

01/10/2017 - 02:25

న్యూఢిల్లీ, జనవరి 9: డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ఇంధన కొనుగోళ్లపై లావాదేవీల సర్‌చార్జి భారాన్ని అటు వినియోగదారులు గానీ ఇటు పెట్రోలు బంకు యజమానులు గానీ భరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వివరణ ఇచ్చారు.

01/10/2017 - 02:24

న్యూఢిల్లీ, జనవరి 9: కేవలం రక్తపరీక్షతో ఓ వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడు, వృద్దాపత్యంలో డిమెన్షియా (మతిమరుపు)సహా ఏ రకమైన సమస్యలు లేకుండా మనుగడ సాధించగలుగుతాడు అన్నదానిపై తాజాగా ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. రక్తంలో ఉండే కొన్ని రకాల జీవ, రసాయనిక పదార్థాల ఆధారంగా ఒక వ్యక్తి ఆయుర్దాయాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

01/10/2017 - 02:16

గాంధీనగర్, జనవరి 9:రైల్వే మంత్రిత్వ శాఖను బేరసారాల పాచికగా వాడుకునే గత సంస్కృతికి స్వస్తి పలుకుతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు అనుసరించిన ఈ పద్ధతికి భిన్నంగా రైల్వేలను సమగ్ర రీతిలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మిత్ర పక్షాలకు రైల్వే మంత్రిత్వ శాఖను ట్రోఫీగా పంచేదని..

01/10/2017 - 02:15

న్యూఢిల్లీ, జనవరి 9: పింఛనుకు సంబంధించిన అన్ని కేసుల ప్రక్రియను తప్పనిసరిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. పింఛను కేసుల ప్రక్రియలో జాప్యాన్ని నివారించటంతో పాటు మరింత పారదర్శకతను నెలకొల్పటానికి కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛను వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులను ఆదేశించింది.

01/10/2017 - 02:04

న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)లో నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగి రైతులకు ఇప్పించాలని కోరుతూ దాఖలయిన ప్రజాప్రయోజనాల పిటిషన్ (పిల్)కు సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

01/10/2017 - 02:01

న్యూఢిల్లీ, జనవరి 9: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. కృష్ణా పరీవాహకంలోని నాలుగు రాష్ట్రాలకు జలాలను పునఃపంపకాలు చేపట్టాలంటూ తెలంగాణ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సైతం కొట్టేవేసింది.

01/09/2017 - 02:41

ముంబయి, జనవరి 8: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విచారణ జరుపుతున్న పార్లమెంటుకు చెందిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి)నోట్ల రద్దు ప్రక్రియపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కొన్ని ప్రశ్నలను పంపించడమే కాకుండా ఈ నెల 20న కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

Pages