S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/09/2017 - 02:26

న్యూఢిల్లీ, జనవరి 8: సమాజ్‌వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం మళ్లీ జడ్ కేటగిరి భద్రత కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఇటీవల తలెత్తిన అంతర్గత కలహాల నేపథ్యంలో అమర్‌సింగ్‌కు ముప్పు పొంచి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ భద్రత కల్పించింది.

01/09/2017 - 02:22

కొమ్మనొదిలి గుమ్మంలో వాలే కాకులు ఎక్కడైనా కనిపిస్తాయి. కానీ -కోల్‌కతా కాకుల రూటే సెపరేటు. చెట్టుకొమ్మలు, చూరుగుమ్మాలు వదలి ఏకంగా బస్సెక్కేశాయి. కండక్టర్ పైకెక్కి టికెట్ ఎలాగూ అడగలేడు కనుక ఫ్రీ జర్నీ చేసేస్తున్నాయి. తన బతుకును చీప్‌గా చిత్రించిన పలుగాకులకు ఇలా కొత్త కథ చెబుతున్నాయి. కోల్‌కతాలో ఆదివారం ఓ నడుస్తున్న బస్సుపై దర్జాగా వాలిన వాయసాలను ఓ కెమెరామన్ ఇలా క్లిక్ మనిపించాడు.

01/09/2017 - 02:19

ఉత్తర భారత దేశంతోపాటు జమ్ము-కాశ్మీర్‌లో గత రెండు రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేయడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయన వాహనాలు

01/09/2017 - 02:17

న్యూఢిల్లీ, జనవరి 8: సభ్య సమాజంలో దోషులకు శిక్ష విధించేటప్పుడు ‘పన్నుకు పన్ను.. కన్నుకు కన్ను’ అనే సిద్ధాంతం కొలమానంగా ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు హత్య కేసుల్లో ఇప్పటికే 16 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవించిన ఢిల్లీకి చెందిన మాజీ విద్యార్థిని విడుదల చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

01/09/2017 - 02:16

న్యూఢిల్లీ, జనవరి 8: న్యాయపరమైన సమతుల్యతను కాపాడడం, అలాగే న్యాయ నిర్ణయ ప్రక్రియకు విఘాతం కలిగించకుండా ఉండడం న్యాయమూర్తి విధి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అల్లర్లకు సంబంధించిన ఒక కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

01/09/2017 - 02:15

న్యూఢిల్లీ, జనవరి 8: గ్రామీణ ప్రాంత ప్రజలకు సంవత్సరంలో కనీసం 100 రోజులు ఉపాధి కల్పించేందుకు అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కింద ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఉపాధి పొందాలనుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి.

01/09/2017 - 03:02

ముంబయి, జనవరి 8: పిల్లలు చిన్నప్పటినుంచే మహిళలను గౌరవించడం నేర్చుకునేలా వారిని తల్లిదండ్రులు పెంచాలని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హితవు పలికారు. బెంగళూరులో డిసెంబర్ 31న రాత్రి పెద్దఎత్తున పోలీసులు ఉండగానే కొంతమంది మహిళలపై జరిగిన లైంగిక దాడి పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

01/09/2017 - 02:14

న్యూఢిల్లీ, జనవరి 8: ముస్లింలు గణనీయ సంఖ్యలో గల కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మైనారిటీలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో అయిదు మైనారిటీ యూనివర్శిటీలను నెలకొల్పే అంశాన్ని తెరపైకి తెచ్చింది.

01/09/2017 - 02:13

పనాజీ, జనవరి 8: గోవా శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు కొత్తగా రంగప్రవేశం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనోహర్ పారిక్కర్ నేతృత్వంలోని బిజెపి 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది.

01/09/2017 - 02:13

న్యూఢిల్లీ, జనవరి 8: నోట్ల రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ‘జేబుదొంగ’ వలె ప్రజల డబ్బును కాజేశారని విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వృద్ధి పెద్దగా దెబ్బతినలేదన్న ప్రభుత్వ వాదనను కూడా ఆయన ఖండించారు.

Pages