S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/07/2017 - 02:08

ముంబయి, జనవరి 6: పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎన్‌డిఏలో కీలక భాగస్వామ్య పక్షమైన శివసేన కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గత పదివేల సంవత్సరాల కాలంలో అత్యంత దుర్మార్గమైన పాలన ఇదేనని పేర్కొంది.

01/07/2017 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 6: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్)లలో నిరుపయోగంగా ఉన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. 2006లో సెజ్‌లు ఏర్పాటుకు దేశవ్యాప్తంగా వందల ఎకరాలు భూములను తీసుకొని అందులలో సగానికి పైగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేందటూ కాకినాడ రైతు సంక్షేమ సంస్ధ సుప్రీంలో పిటిషన్ వేసింది.

01/07/2017 - 02:05

హైదరాబాద్, జనవరి 6: హెచ్‌సిఎల్ సంస్థ తన గ్రాంట్‌ను మంజూరు చేసేందుకు దేశంలో తొమ్మిది ఎన్‌జిఓలను షార్టు లిస్టు చేసిందని సంస్థ సిఎస్‌ఆర్ డైరెక్టర్ నిధి పుంధిర్ తెలిపారు.

01/07/2017 - 01:39

న్యూఢిల్లీ, జనవరి 6: పేదల పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, ఇతర పార్టీలనుంచి బిజెపి వారిని లాగేసుకుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంటూ, ఇప్పుడు పేదలు ప్రధాని నరేంద్ర మోదీకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు.

01/07/2017 - 01:37

న్యూఢిల్లీ, జనవరి 6: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వ చ్చేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి ముస్లిం- దళిత్ సంయోగత ద్వారా ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు.

01/07/2017 - 01:35

కోల్‌కతా, జనవరి 6: నోట్ల రద్దు వ్యవహారం, చిట్‌ఫండ్ కుంభకోణాల్లో తమ పార్టీ ఎంపీలను అరెస్టు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్న తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

01/07/2017 - 01:33

న్యూఢిల్లీ, జనవరి 6: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా తన బ్లాగ్‌లో వ్యాఖ్యలు చేసినందుకుగాను శుక్రవారం బేషరతు క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణను మన్నించిన సుప్రీంకోర్టు ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలను నిలిపివేసింది.

01/07/2017 - 01:31

తిరువనంతపురం, జనవరి 6: కేరళలోని శబరిమలలో గల అయ్యప్ప దేవాలయంలోకి సంప్రదాయాలకు, ఆచారాలకు విరుద్ధంగా ఎవరినీ అనుమతించబోమని ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రావన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టిడిబి) స్పష్టం చేసింది. పది నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల ఆడవారిని ఈ ఆలయంలోకి అనుమతించరు.

01/07/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 6: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2017-18 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమర్పణను ఏప్రిల్ దాకా వాయిదా వేయాలని కోరుతూ దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) త్వరగా విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ‘తొందరేముంది.

01/07/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 6: లష్కరే ఉగ్రవాది బహదూర్ అలీపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పాటియాలా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకాశ్మీర్‌లో భద్రతాదళాలకు గత ఏడాది జూలైలో పట్టుబడ్డాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ భారత్‌పై దాడులకు వ్యూహరచన చేసేవాడు. బహదూర్ అలీ పాకిస్తాన్‌లో శిక్షణ పొందాడని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. అతడూ పాకిస్తాన్‌లోని లాహోర్ జిల్లా జియాబఘా గ్రామానికి చెందిన వాడు.

Pages