S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/07/2017 - 01:29

కౌలాలంపూర్, జనవరి 6: గల్లంతైన ఎంహెచ్ 370 విమానం కోసం గాలింపుచర్యలు నిలిపివేస్తున్నారు. మరో రెండువారాల్లో గాలింపును ఆపేస్తున్నట్టు మలేసియా రవాణా మంత్రి శుక్రవారం వెల్లడించారు. బాధిత కుటుంబాలు మాత్రం గాలింపుచర్యలు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న గల్లంతైంది. గాలింపుఆపరేషన్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు రవాణా మంత్రి లియో టియోంగ్ తెలిపారు.

01/07/2017 - 01:28

చిత్రాలు..ఓం పురి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమారుడు, పక్కన భార్య నందిత
*అంత్యక్రియలకు హాజరైన పంకజ్‌కపూర్, శశికపూర్

01/07/2017 - 00:51

న్యూఢిల్లీ, జనవరి 6:ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, వస్తువుల్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉందంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని మాత్రం నిలుపుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

01/07/2017 - 00:48

ముంబయి, జనవరి 6: సమాంతర సినిమాకు చిరునామా భాసిల్లి వెండితెరపై ఎన్నో వైవిధ్యభరిత పాత్రలకు ప్రాణం పోసి, సత్తా ఉంటే ఎవరైనా హీరో కావచ్చునని రుజువుచేసిన విలక్షణ నటుడు ఓం పురి (66)ఇక లేరు. శుక్రవారం తెల్లవారు జామున తీవ్ర గుండెపోటు రావడంతో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచారు.

01/06/2017 - 05:01

న్యూఢిల్లీ, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించే విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

01/06/2017 - 02:55

హైదరాబాద్, జనవరి 5: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ప్రధాన నిందితుడు కమలేశ్వర్ కుమార్ సింగ్ (55) మృతి చెందాడు. బిహార్‌కు చెందిన కమలేశ్వర్ కుమార్ ప్రస్తుతం సిఐడి కస్టడీలో ఉన్నాడు. సిఐడి కస్టడీలో ఉండగానే అతను అస్వస్థకు గురయ్యాడని, వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని సిఐడి అధికారులు తెలిపారు.

01/06/2017 - 02:17

న్యూఢిల్లీ, జనవరి 5:ఒక వ్యక్తి 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల తన భార్యతో సంభోగంలో పాల్గొంటే ఆ చర్యను లైంగిక దాడుల నుంచి బాలల పరిరక్షణ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెనె్సస్- పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణిస్తారా? అని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

01/06/2017 - 02:16

చండీగఢ్, జనవరి 5: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎవరైనా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో అడ్వర్టయిజ్‌మెంట్లు (ప్రాయోజిత ప్రకటనలు) ఇచ్చినా వాటికి అయిన ఖర్చును అభ్యర్థులు చేసిన వ్యయంగానే పరిగణించడం జరుగుతుందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి ఒకరు గురువారం ఇక్కడ చెప్పారు.

01/06/2017 - 02:13

బెంగళూరు, జనవరి 5: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి దేశ ఐటి రాజధాని బెంగళూరు నగరంలో జరిగిన వికృత చేష్టలపై తాను చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర గురువారం మాటమార్చారు.

01/06/2017 - 02:05

లక్నో, జనవరి 5: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) తన ప్రత్యర్థుల కన్నా ముందుంది. 403 సీట్లు గల యుపి అసెంబ్లీలో ఆ పార్టీ 20 జిల్లాలకు చెందిన వంద మంది అభ్యర్థులను గురువారం అధికారికంగా ప్రకటించింది. వీరిలో మూడో వంతుకు పైగా మంది ముస్లింలు ఉన్నారు. రాష్ట్ర ఓటర్లలో సుమారు 20 శాతం మంది ముస్లింలు ఉన్నారు.

Pages