S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2017 - 01:53

న్యూఢిల్లీ, జనవరి 2: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఢిల్లీకి చేరింది. ఇటు ములాయం అటు అఖిలేష్ వర్గాలు పార్టీ చిహ్నమైన ‘సైకిల్’కోసం పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ వచ్చిన ములాయం సింగ్ యాదవ్ సైకిల్ గుర్తు తమదేనని వాదించారు. సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయించవొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ములాయం విజ్ఞప్తి చేశారు.

01/03/2017 - 01:51

లక్నో, జనవరి 2: ఉత్తరప్రదేశ్‌లో గత పధ్నాలుగు సంవత్సరాలుగా సాగుతూ వచ్చిన అభివృద్ధి అజ్ఞాతవాసానికి త్వరలోనే తెరపడబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో సరికొత్త అభివృద్ధి శకం ప్రారంభం కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘గత పధ్నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేదు. ఆ అజ్ఞాతవాసం ముగుస్తుందని చాలామంది అంటున్నారు.

01/03/2017 - 01:49

న్యూఢిల్లీ, జనవరి 2: ఇటు పాకిస్తాన్, అటు చైనాలను ఏకకాలంలో ఎదుర్కోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. అయితే చైనాతో సంఘర్షణ కంటే కూడా సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపైనే దృష్టిపెడతామని అన్నారు. మొత్తం చైనాలోని లక్ష్యాన్నైనా చేధించగలిగే 5వేల కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-5 అణు క్షిపణి పరీక్షపై చైనా వ్యాఖ్యాలను ఆయన ప్రస్తావించారు.

01/03/2017 - 01:48

చెన్నై, జనవరి 2: అన్నాడిఎంకె పగ్గాలు చేపట్టిన శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న డిమాండ్ పార్టీలో ఊపందుకుంటోంది. పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలో ఉంటేనే సమర్థవంతమైన పాలన లభిస్తుందని అన్నాడిఎంకె సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డిమాండ్ చేశారు.

01/03/2017 - 01:48

న్యూఢిల్లీ, జనవరి 2: కోర్టు ధిక్కారం కేసులో నలుగురు జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నలుగురు జర్నలిస్టులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.

01/03/2017 - 01:46

న్యూఢిల్లీ, జనవరి 2: తన అధీనంలో ఉన్న 51మంది భారతీయ జాలర్లను వదిలిపెట్టేందుకు సోమవారం శ్రీలంక అంగీకరించింది. మరోవైపు భారత్ తన దగ్గరున్న ముగ్గురు లంక జాలర్లను వదిలేందుకు ఒప్పుకుంది. ఇరుదేశాల అధికారుల మధ్య సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.

01/03/2017 - 01:46

న్యూఢిల్లీ, జనవరి 2: కేంద్ర ఎన్నికల సంఘం రెండు మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాసింది.

01/03/2017 - 01:17

న్యూఢిల్లీ, జనవరి 2: కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 44కోట్ల మందికి పక్కా ఆవాసాలు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. వీరికి కల్పించే ఆవాసాలకు విద్యుత్, మంచినీరు, ఎల్‌పిజి కనెక్షన్లనూ సమకూరుస్తామని తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోచన పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేస్తామని తెలిపింది.

01/03/2017 - 01:05

న్యూఢిల్లీ, జనవరి 2: ఠారెస్తున్న సర్వీసు చార్జీలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఇతర పన్నులతో పాటు విధించే సర్వీసు చార్జి ఐచ్ఛికమేనని, దీన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

01/03/2017 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 2: కులం, మతం వంటి వాటితో లౌకిక స్ఫూర్తికి విఘాతంగా పరిణమిస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది. రాజకీయాలతో కుల, మత విశ్వాసాలకు ఎలాంటి సంబంధం ఉండకూడదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కులం,మతం, జాతి, భాష వంటిని ఎంత మాత్రం రాజకీయ సంబంధితమైనవి కాదని తేల్చిచెప్పింది.

Pages