S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/02/2016 - 01:06

న్యూఢిల్లీ, డిసెంబరు 1: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి 2,981 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు ఆర్థికశాఖ సమాచారం పంపించినట్టు తెలిపారు. నాబార్డ్‌నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు.

12/01/2016 - 08:51

జమ్ము, నవంబర్ 30: జమ్ములో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులు సాంబా జిల్లాలో ఒక సొరంగం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించారని సరిహద్దు భద్రతాదళం గుర్తించింది. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతంలో ఒక సొరంగాన్ని గుర్తించింది. నగ్రోటాలో ఎదురుకాల్పులు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో సైన్యం జరిపిన సర్చ్ ఆపరేషన్‌లో విస్మయం గొలిపే అంశాలు బయటపడ్డాయి.

12/01/2016 - 08:50

న్యూఢిల్లీ, నవంబర్ 30: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించేందుకు బుధవారం లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అవగాహన కుదిరినట్లే కుదిరి మళ్లీ మొదటికి వచ్చింది.

12/01/2016 - 08:48

న్యూఢిల్లీ, నవంబర్ 30: జమ్మూకాశ్మీర్‌లోని నగ్రోటా సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికులకు నివాళులర్పించ లేదంటూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆ తరువాత స్పీకర్ సుమిత్రా మాహాజన్‌కు క్షమాపణలు చెప్పారు. ‘మిమ్మల్ని బాధ పెట్టాలని, విమర్శించాలని మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం సరైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేదు.

12/01/2016 - 07:29

డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్, ఈ-వ్యాల్లెట్లు, అంతర్జాల బ్యాంకింగ్ విధానం, యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ యాప్స్‌లను త్వరితగతిన విస్తరించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను ఈ కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

12/01/2016 - 07:27

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోను సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతాన్ని ప్రసారం చేసేటప్పుడు స్క్రీన్‌పై జాతీయ పతాకం కనిపించాలని, ప్రేక్షకులందరూ లేచి నిలుచుని గౌరవాన్ని ప్రదర్శించాలని కూడా స్పష్టం చేసింది.

12/01/2016 - 07:25

న్యూఢిల్లీ, నవంబర్ 30: జన్‌ధన్ ఖాతాలను నల్లకుబేరులు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే చర్యల్ని రిజర్వ్ బ్యాంక్ చేపట్టింది. ఈ ఖాతాల నుంచి నెలకు పదివేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు విధించింది. తమ ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలు నింపిన ఖాతాదారులు నెలకు పదివేలు తీసుకోవచ్చు. కానీ, వివరాలివ్వని ఖాతాదారులు నెలకు 5 వేలకు మించి తీసుకోవడానికి వీలుండదు.

11/30/2016 - 03:53

న్యూఢిల్లీ,నవంబర్ 29: తెలంగాణాలో ఆయుర్వేద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాదనాయక్ ఆమోదం తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం పార్లమెంటు ఆవరణలో శ్రీపాదనాయక్‌తో చర్చలు జరిపారు.

11/30/2016 - 02:59

న్యూఢిల్లీ, నవంబర్ 29: బిజెపి పార్లమెంటు సభ్యులందరు తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు చేసిన నవంబర్ 8నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు తమ ఖాతాల లావాదేవీల పూర్తి వివరాలను అందజేయాలన్నారు.

11/30/2016 - 02:38

న్యూఢిల్లీ, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను టిడిపి ఎంపీ శివప్రసాద్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఆయన వినూత్న నిరసన తెలిపారు. నలుపుతెలుపుదుస్తులు ధరించిన ఆయన పార్లమెంటుకు హాజరయ్యారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లకుభేరులు వికటాట్టహాసం చేస్తూ ఉంటే, పేద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.

Pages