S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/25/2016 - 06:52

అర్ధరాత్రి నుంచే అమలు
పాత వెయ్యినోటుతో బిల్లుల చెల్లింపు నిలిపివేత
పాత 500నోటుతో చెల్లింపులకు 15వరకు గడువు
2 దాకా టోల్ రుసుం మినహాయింపు
3నుంచి 15దాకా రూ.500తో టోల్ పన్ను స్వీకరణ
విదేశీయులకు వారానికి రూ.5వేల వరకు నగదు మార్పిడి
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయాలు

11/24/2016 - 08:37

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల చలామణీని రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై భారీగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే దీన్ని భరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఈ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

11/24/2016 - 08:35

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేయటం వలన సామాన్య జనం పడుతున్న కష్టాలను ఎన్‌డిఏ ప్రభుత్వం పరిష్కరించటం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా చేశాయి.

11/24/2016 - 08:30

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఓసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గటం అన్నది ప్రధాని నరేంద్రమోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం ఉద్ఘాటించారు. కొన్ని విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినంత మాత్రాన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

11/24/2016 - 08:28

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్దనోటు రద్దుపై పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. విపక్షాల నిరసనలు, అరుపులు, నినాదాలు, వ్యంగ్య కూత లు, హాహాకారాలు ఉభయ సభల్లో వినిపించాయి. లోక్‌సభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ‘ఓ ఓ’ అంటూ సభ దద్దరిల్లేలా భయంకరంగా అరుస్తూ కార్యక్రమాలకు అడ్డుతగిలారు.

11/24/2016 - 08:28

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల విచారణపై స్టే ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి వివిధ కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టులోనో, ఏదైనా ఒక హైకోర్టులోనో ఒకేచోట విచారణ జరపాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.

11/24/2016 - 08:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి మెహబూబా అక్తర్ గూఢచర్యం బయటపడడంతో ఎనిమిది మంది ఎంబసీ అధికారులను ఆ దేశం ఉపసంహరించుకుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే భారత్ కూడా ఎనిమిది మంది అధికారులను వెనక్కురప్పించినట్టు బుధవారం పార్లమెంటుకు తెలిపింది.

11/24/2016 - 08:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి పార్లంమెంట్ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బాల మురళి సంగీత ప్రపంచానికి చేసిన సెవలను సభ కొనియాడింది. ఆయన మృతికి సంతాప సూచకంగా సభ 2 నిముషాలు వౌనం పాటించింది. అలాగే రాజ్యసభ కూడా ఆయన భారతీయ శాస్ర్తియ సంగీత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిఅని చైర్మన్ అన్సారీ కొనియాడారు.

11/24/2016 - 07:17

న్యూఢిల్లీ, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 31 జిల్లాలలో కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశా వ్యాప్తంగా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాల నీటి పారుదలశాఖ మంత్రుల సమావేశానికి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.

11/24/2016 - 04:46

ముంబయి, నవంబర్ 23: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

Pages