S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2016 - 05:42

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కలల ప్రాజెక్టు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే సోమవారం ప్రారంభమయింది. భారత వాయుసేన (ఐఎఎఫ్) యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ హైవేను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదినమైన నవంబర్ 21న ప్రారంభించడం విశేషం.

11/22/2016 - 05:40

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్వాయికి అభినందనలు తెలియజేస్తున్న
ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, వైకాపా ఎంపిలు వై.వి సుబ్బారెడ్డి, మేకపాటి, కాంగ్రెస్ ఎంపిలు కెవిపి, సుబ్బిరామిరెడ్డి

11/22/2016 - 05:14

న్యూఢిల్లీ,నవంబరు 21: పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు ఏదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. సోమవారం నాడు కెటిఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, ఆస్ట్రేలియా రాయబారితో విడివిడిగా సమావేశమయ్యారు.

11/22/2016 - 05:08

భద్రాచలం, నవంబర్ 21: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సుక్మా ఎఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. చింతలనార్ - నర్సాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి సిఆర్‌పిఎఫ్ 74వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పహరా కాస్తున్నారు.

11/22/2016 - 04:03

జమ్మూ, నవంబర్ 21: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పూంచ్ జిల్లా కృష్ణా ఘటీ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల్లో ఓ బిఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఎల్‌ఓసి వద్ద భారత శిబిరాల లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగింది.

11/22/2016 - 04:00

న్యూఢిల్లీ, నవంబర్ 21: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వరి వంగడాలు రావాలని ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త ఎంఎస్ స్వామినాథన్ స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలకు విశ్రాంతి అన్నది ఉండదని పరిస్థితులకు అనువైన కొత్త రకాలకు అనే్వషణ జరగాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను అనువైన వంగడాలు అభివృద్ధి చేస్తూ వరి అధికోత్పత్తికి కృషి చేయాలని ఆయన చెప్పారు.

11/22/2016 - 03:02

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఆర్థిక శాఖ మరింత ఊరట కలిగిస్తూ పలు చర్యలను ప్రకటించింది.

11/22/2016 - 03:08

ముంబయి, నవంబర్ 21: దేశంలో పెద్ద నోట్ల చెలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న సంచలన నిర్ణయం ప్రకటించిన తర్వాత బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్లు, విత్‌డ్రాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. వెయ్యి, 500 రూపాయల నోట్ల చెలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.

11/22/2016 - 03:29

న్యూఢిల్లీ, నవంబర్ 21: తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణకు అవసరమైన భూమిని వీలైనంత త్వరగా సేకరించి ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి హామీ ఇచ్చారు.

11/22/2016 - 02:53

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు తమ ఆందోళనను మంగళవారం నుంచి ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.

Pages