S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/18/2016 - 03:11

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభలూ గురువారం దద్దరిల్లి పోయాయి. దేశ వ్యాప్తంగా సామాన్యుల జీవితాలు వీధిన పడ్డాయంటూ విపక్షాలు రెండు సభల్లోనూ ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. కోటానుకోట్ల మంది జీవితాలను వీధిపాలు చేసిన ఈ నిర్ణయంపై జరుగుతున్న చర్చకు హాజరై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు సర్కార్ నిరాకరించింది.

11/18/2016 - 03:39

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్లు రద్దయి పది రోజులు గడిచినా సామాన్యుల కష్టాలకు అంతూ పొంతూ లేకపోవడంతో కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. కొత్త నోట్లకు తగ్గట్టుగా ఏటిఎమ్‌లు సాంకేతికంగా సిద్ధం కాకపోవడంతో ఇక పెట్రోలు బంకుల్నే ఎటిఎమ్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఆ విధంగా ఎటిఎమ్‌లు, బ్యాంకులపై వత్తిడి తగ్గించే యోచన చేసింది.

11/17/2016 - 23:53

పుణె, నవంబర్ 17: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత జంటగా రికార్డు సృష్టించాలనుకున్న కానిస్టేబుళ్ల జంట ప్రయత్నం వికటించింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో మీడియా ముందు ప్రకటించుకుని, తొలి జంటగా తమకు తాముగా ప్రకటించుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే వారు ఎవరెస్టును అధిరోహించలేదని, ఆ బృందాల్లో ఈ జంట పాలుపంచుకోలేదని తేలడంతో అసలు రంగు బయటపడింది.

11/17/2016 - 23:50

న్యూఢిల్లీ, నవంబర్ 17: నోట్ల రద్దు వ్యవహారం ఉభయ సభలను గురువారం కూడా కుదిపేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బ తీసేలా నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి మోదీ సభకు వచ్చి ఎందుకు జవాబివ్వటం లేదని పెద్దల సభలో విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారకుడైన మోదీ సభకు వచ్చి సమాధానమిచ్చేంత వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగనిచ్చేది లేదని విపక్షాలు భీష్మించుకున్నాయి.

11/17/2016 - 23:49

న్యూఢిల్లీ/ ముంబయి, నవంబర్ 17: దేశంలో కరెన్సీ కొరతపై అటు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చెబుతున్న మాటలకు, ఇటు వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరటం లేదు. పది రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్‌లో ద్రవ్య చలామణి తీవ్రంగా పడిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

11/17/2016 - 23:47

ఆజమ్‌గఢ్, నవంబర్ 17: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, నల్లధనం లేనివాళ్లు ఈ నిర్ణయాన్ని విమర్శించడానికి కారణమే లేదని, నల్లధనం ఉన్నందువల్లనే ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ‘మాయావతి, కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, మమత, కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీలు..

11/17/2016 - 23:44

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని పహార్‌గంజ్ ప్రాంతంలో ఓ పిల్లల డాక్టర్ నుంచి 70 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదంతా వంద రూపాయల నోట్లేనని పోలీసులు వెల్లడించారు. నల్లాల్ అనే వైద్యుడు వంద రూపాయల నోట్ల కట్టలను కారులో తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. 69,86,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ వంద రూపాయల నోట్లేనని పోలీసులు తెలిపారు.

11/17/2016 - 23:43

అహ్మదాబాద్, నవంబర్ 17: గుజరాత్‌లో 2.9 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న కాండ్లా పోర్టుట్రస్ట్ (కెపిటి) అధికారులు ఇద్దరు, మరో దళారిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఓ ప్రైవేటు సంస్థ నుంచి అన్నీ కొత్త 2000 రూపాయల నోట్లు లంచంగా తీసుకుంటూ దొరికిపోయారు.

11/17/2016 - 23:42

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఉరీలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన వారి కంటే రెండింతల మంది నోట్ల కోసం క్యూలో నిలబడి చనిపోయారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేప్రసక్తే లేదని రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు.

11/17/2016 - 23:42

న్యూఢిల్లీ, నవంబర్ 17: బులంద్‌శహర్ గ్యాంగ్ రేప్ సంఘటనను రాజకీయ కుట్రగా అభివర్ణించింనందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజమ్‌ఖాన్‌ను గురువారం ఆదేశించింది. అంతేకాక రేప్‌లు, అత్యాచారం లాంటి కేసుల్లో ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యల విషయంలో అటార్నీ జనరల్ సాయాన్ని సైతం కోర్టు కోరింది.

Pages