S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/09/2016 - 02:25

బెర్హంపూర్, అక్టోబర్ 8: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మిలటరీ స్టేషన్‌ను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రారంభించారు. మిలటరీ స్టేషన్‌కు 2014లో ప్రణబ్ శంకుస్థానం చేశారు. ఈ స్టేషన్ ఏర్పాటుతో కోల్‌కతా, సిలిగురి ప్రాంతాల సేవలందుతాయి. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోనే దీన్ని మిలటరీ కంటోనె్మంట్‌గా వినియోగించుకున్నారు.

10/09/2016 - 02:24

బర్మేర్, అక్టోబర్ 8: భారత్-పాక్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు, బిఎస్‌ఎఫ్ అధికారులతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ జైసల్మేర్‌నుంచి బర్మేర్‌కు చేరుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

10/09/2016 - 02:21

చెన్నై, అక్టోబర్ 8: కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమిళనాడు బిజెపి శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటును బిజెపి వ్యతిరేకిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ తమిళనాడు నేతలు అధినాయకత్వంలో సమావేశం కావాలని నిర్ణయించడం గమనార్హం.

10/09/2016 - 02:17

శ్రీనగర్, అక్టోబర్ 8: కాశ్మీర్‌లోయలో అశాంతి ఇప్పట్లో తగ్గేట్లు కనిపించటం లేదు. శుక్రవారం సాయంత్రం జరిగిన అల్లర్లలో పోలీసులు డమీ బుల్లెట్ల (పెల్లెట్)తో జరిపిన కాల్పుల్లో గాయపడిన 12 సంవత్సరాల బాలుడు శనివారం మరణించటంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.

10/09/2016 - 02:14

శ్రీనగర్, అక్టోబర్ 8: పిఓకె నుంచి భారత్‌లోకి చొరబడుతూ సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, గ్రెనేడ్లు, మందులు పాకిస్తాన్‌లోనే తయారయ్యారని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. గురువారంనాడు భారత్‌లోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.

10/09/2016 - 02:12

వడోదరా, అక్టోబర్ 8: దేశవ్యాప్తంగా 2017 మే కల్లా అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూశ్ గోయల్ శనివారం వెల్లడించారు. వెయ్యి రోజుల్లోగా దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని ఎన్‌డి ఎ ప్రభుత్వం నిరుడు నిర్ణయించిందని, ఆ గడువు పూర్తయ్యే లోగా కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని గోయల్ తెలిపారు.

10/09/2016 - 02:11

పనాజి, అక్టోబర్ 8: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కాంక్షిస్తూ గోవా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలలో ఈ నెల 16న ప్రార్థనలు నిర్వహించనున్నారు. 16న రోజువారి ప్రార్థనలను పక్కన పెట్టి సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని గోవా ఆర్చ్‌బిషప్ డామన్ ఫిలిప్ నేరి ఫెర్రారో శనివారం చెప్పారు.

10/08/2016 - 07:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై భారత సైన్యం జరిపిన మెరపుదాడులను (సర్జికల్ స్ట్రైక్స్) కొంతమంది రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంటూ ఇది సరికాదన్నారు.

10/08/2016 - 06:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో తానిచ్చిన స్టేను శుక్రవారం సుప్రీంకోర్టు పొడిగించింది. అక్టోబర్ 17న తదుపరి విచారణ వరకూ స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యా యస్థానం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి ఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.

10/08/2016 - 06:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత సైన్యాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవడాన్ని తాను సమర్థించనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Pages