S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/08/2016 - 06:51

చెన్నై, అక్టోబర్ 7: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

10/08/2016 - 06:49

పల్లన్‌వాలా, అక్టోబర్ 7: ఫిరంగుల మోతకు అతడు వెరవలేదు. ఒళ్లు జలదరించే భయానక వాతావరణం, సైనికుల బూట్ల చప్పుళ్లు అతడి లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. పదిహేనేళ్ల సురీందర్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి ధైర్య సాహసాలకు ఫిదా అవ్వాల్సిందే. పల్లన్‌వాలా సెక్టార్ గతనెల 28-29 తేదీల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్ చేపట్టిన రోజది.

10/08/2016 - 06:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలుచేయడానికి, పారదర్శకతతో పనిచేయడానికి సామాజిక కార్యక్తలు, పాత్రికేయులు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వశాఖల్లో ఆర్‌టిఐని అమలుచేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

10/08/2016 - 06:48

ముంబయి, అక్టోబర్ 7: భారత సైన్యం జరిపిన లక్షిత దాడులపై సం దేహం వ్యక్తం చేస్తూ వివాదాన్ని రాజేసిన ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్.. తనకు గ్యాంగ్‌స్టర్ రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని శుక్రవారం ఇ క్కడ విలేఖరుల సమావేశంలో చె ప్పారు. లక్షిత దాడులపై తాను చేసి న వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రవి పూజారి హెచ్చరించినట్టు సంజయ్ నిరుపమ్ పే ర్కొన్నారు.

10/08/2016 - 06:38

శ్రీనగర్, అక్టోబర్ 7: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ లక్షిత దాడుల అనంతరం జమ్ము కాశ్మీర్‌లో భద్రతాదళాలను లక్ష్యం చేసుకుని సాగుతున్న ఉగ్రదాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సోఫియాన్ జిల్లాలో ఓ పోలీస్ గార్డ్ పోస్ట్‌పై శుక్రవారం రాత్రి 8.30 తరువాత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.

10/08/2016 - 06:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముస్లిం కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న మూడు తలాఖ్‌ల సంప్రదాయానికి లౌకిక దేశమైన భారత్‌లో చోటు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ముస్లిం కుటుంబాల్లో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి ఇది కారణం అవుతోందని తెలిపింది.

10/08/2016 - 06:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ కేవలం హంగు ఆర్భాటాలకు ముఖ్యమంత్రి పోతున్నారని మండిపడ్డారు.

10/08/2016 - 06:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముస్లిం కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న మూడు తలాఖ్‌ల సంప్రదాయానికి లౌకిక దేశమైన భారత్‌లో చోటు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ముస్లిం కుటుంబాల్లో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి ఇది కారణం అవుతోందని తెలిపింది.

10/08/2016 - 06:10

ఇస్లామాబాద్, అక్టోబర్ 7: హాట్‌లైన్ సహా భారత సైన్యంతో అన్ని కమ్యూనికేషన్ మార్గాలు తెరిచే ఉన్నాయని పాకిస్తాన్ సైన్యం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే భారత సైన్యం ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించింది. ‘్భరతీయ సైన్యం కాల్పులు జరపడం ద్వారా నియంత్రణ రేఖను ఉల్లంఘించింది. ఆ తర్వాత కొద్ది గంటలకు లక్షిత దాడులు జరిపామని తప్పుడు ప్రకటన చేసింది. అయితే మేము అక్కడ అన్ని వాస్తవ పరిస్థితులను చెక్ చేశాము.

10/08/2016 - 06:10

జమ్ము, అక్టోబర్ 7: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనూహ్యంగా దాడిచేసి ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన అనంతరం పాకిస్తాన్ అనుక్షణం కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. సెప్టెంబర్ 29న భారత్ జరిపిన లక్షిత దాడుల తర్వాత ఇప్పటివరకు 25సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీనియర్ సైనిక అధికారి ఒకరు వెల్లడించారు.

Pages