S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/08/2016 - 05:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 7:అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు లభించే అత్యాధునిక రాజధానిగా అమరావతిని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచంలోని ఐదు అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా రూపొందిస్తామన్నారు. ఢిల్లీలో శుక్రవారం సిఐఐ ఏర్పాటుచేసిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పట్టణీకరణపై ఆయన ప్రసంగించారు.

10/08/2016 - 04:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వయోవృద్ధులైన తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టడానికి భార్య ప్రయత్నిస్తే హిందూ భర్త ఆమె నుంచి విడాకులు కోరేందుకు అన్ని విధాలా అర్హుడని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ‘‘ఒక మహిళ వివాహం తరువాత భర్త కుటుంబంలో భాగస్వామి అవుతుంది.

10/08/2016 - 04:48

చెన్నై, అక్టోబర్ 7: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్న కారణంగా రాష్ట్రంలో అధికార మార్పిడిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం, మరో సీనియర్ మంత్రి పళనిస్వామిలతో అత్యవసరంగా సమావేశమై రాష్ట్రంలో పాలన తీరుపై సమీక్షించటం ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.

10/08/2016 - 02:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: సర్జికల్ దాడికి సంబంధించిన వాస్తవాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేసేవారందరూ దేశద్రోహులని, సైన్యానికి వ్యతిరేకమంటూ రక్షణ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు.

10/07/2016 - 05:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణలోని చారిత్రక వరంగల్ కోటను రూ.15.30 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు.

10/07/2016 - 02:54

భద్రాచలం, అక్టోబర్ 6: ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మెదడువాపు వ్యాధి పంజా విసిరింది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే 9 మంది చిన్నారులు మృతి చెందారు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 39 మంది చిన్నారులు జపనీస్ ఎన్‌సెఫిలైటిస్ పేరుతో పిలిచే ఈ వ్యాధికి బలయ్యారు. పందులు, కొంగల్లో ఉండే ఈ వ్యాధి దోమల ద్వారా సంక్రమిస్తుంది.

10/07/2016 - 01:48

శ్రీనగర్, అక్టోబర్ 6: భారత్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు తమ మద్దతు, ప్రోత్సాహాలు లేవని పాక్ ప్రభుత్వం ఎంతగా బుకాయిస్తున్నప్పటికీ పాక్ సైన్యం, ఇతర ప్రభుత్వ ఏజన్సీల మద్దతుతోనే ఉగ్రవాదులు జమ్మూ, కాశ్మీర్‌లోని భారత భూభాగాల్లోకి చొరబడుతున్నారని మరోసారి స్పష్టం అయింది.

10/07/2016 - 00:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు జరిపిన మెరపు దాడులకు సంబంధించిన సాక్ష్యాలను వెల్లడించవలసిన అవసరం లేదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు.

10/07/2016 - 00:39

చెన్నై, అక్టోబర్ 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన రోదసీ పథంకలో మరో మైలురాయిని అధిరోహించింది.్భరత్‌కు చెందిన జిశాట్-18 ఉపగ్రహాన్ని ఐరోపాకు చెందిన ఏరియన్ 5విఏ-231 రాకెట్‌తో గురువారం ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ద్వారా భారత్ దేశ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ మరింత శక్తివంతమవుతుంది. ప్రస్తుతం 14 టెలికం ఉపగ్రహాలు రోదసీలో పనిచేస్తున్నాయి.

10/07/2016 - 00:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నరేంద్ర మోదీ ఆక్రమిత కాశ్మీర్‌లో లక్షిత దాడులు చేసిన భారత సైనికుల రక్తంతో దళారీగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు, వారి రక్తం వెనుక దాక్కున్నారు’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు కురిపించారు.

Pages