S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/06/2016 - 07:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: హెచ్‌ఐవి, ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారా.. జాగ్రత్త! జైలుపాలవుతారు. ఎయిడ్స్ రోగులు, హెచ్‌ఐవి వైరస్ సోకిన వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొందించిన చట్టం ముసాయిదాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించిన సవరణల ప్రకారం ఈ రోగుల పట్ల వివక్షను ప్రదర్శించిన వారికి గరిష్ఠంగా రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు లక్ష వరకు జరిమానా విధించే వీలుంది.

10/06/2016 - 07:24

అహ్మదాబాద్, అక్టోబర్ 5: వారం రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్‌కు చెందిన మరో పడవను బుధవారం గుజరాత్ తీరంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు తొమ్మిది మంది సిబ్బందితో కూడిన ఒక పాకిస్తాన్ పడవను బిఎస్‌ఎఫ్ అదుపులోకి తీసకున్న విషయం తెలిసిందే.

10/06/2016 - 07:23

వారణాశి, అక్టోబర్ 5: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లక్షిత దాడులకు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ‘శ్రీరాముడు’గా దర్శనమిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ‘రావణుడు’గా చిత్రీకరించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రావణుడి కుమారుడు మేఘనాధుడిగా ఆ పోస్టర్‌లో చోటుదక్కించుకున్నారు.

10/06/2016 - 07:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీల పిల్లల విద్య కోసం ఏం చర్యలు చేపట్టారో వివరిస్తూ నాలుగు వారాలలో అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలపై అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటి నివేదికపై నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

10/06/2016 - 06:53

న్యూఢిల్లీ, అక్టోబరు 5: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

10/06/2016 - 06:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి ఉదాసీతన పనికిరాదని సుప్రీం కోర్టు బుధవారం కేంద్రానికి స్పష్టం చేసింది. గత ఏడాది తప్పులు పునరావృతం కాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరవు కాటక పరిస్థితులు ముంచుకొచ్చే వరకూ ఎదురుచూడకుండా ముందస్తుగానే తగిన సహాయ ఏర్పాట్లతో సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేసింది.

10/06/2016 - 06:33

ఇస్లామాబాద్, అక్టోబర్ 5: కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెగేసి చెప్పారు. అసలు ఎలాంటి నిర్థారణ లేకుండా దాడి జరిగిన కొన్ని గంటల్లోనే భారత్ తమపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టిందన్నారు. కాశ్మీర్ అంశంపై ప్రత్యేకంగా చర్చించడానికి బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాట్లాడిన నవాజ్ భారత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

10/06/2016 - 06:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 5:ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ భారత సేన నిర్వహించిన లక్షిత దాడులపై ఎవరుపడితేవారు ఎలా పడితే అలా మాట్లాడ వద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు, పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా లేదా అన్నదానిపై దేశంలో అవాంఛనీయమైన చర్చ రగులుతున్న నేపథ్యంలో మంత్రులు, బిజెపి నేతలు భుజాలెగరేయడం కట్టిపెట్టాలని హెచ్చరించారు.

10/06/2016 - 07:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పగతో రగులుతున్న పాకిస్తాన్ దేశంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపేందుకు చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న అంశంపై కేబినెట్ భద్రతా వ్యవహారాల ఉప సంఘం లోతుగా చర్చించింది.

10/06/2016 - 06:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత్, పాకిస్తాన్ వాస్తవాధీన రేఖకు సమీపంలో కనీసం వంద మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు లాంచ్ పాడ్‌లలో సిద్ధంగా ఉన్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక నివేదిక సమర్పించారు.

Pages