S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/06/2016 - 06:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని, ఏకపక్షంగా విడాకులు ఇచ్చే వారిని శిక్షించాలని, మహిళలకు విడాకులు తీసుకునే హక్కు కల్పించాలని కోరుతూ అఖిల భారత ముస్లిం మహిళా పర్సన్ లా బోర్డు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతోంది. అప్పటికప్పుడు విడాకులు ఇచ్చే పద్ధతి ఖురాన్ నియమాలకు విరుద్ధమని లాబోర్డు అధ్యక్షురాలు షాయిస్తా అంబర్ అన్నారు.

10/05/2016 - 07:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయటం ద్వారా ప్రపంచానికి తమ శౌర్య, సాహసాలను చాటిచెప్పిన భారత సైనికుల త్యాగాలను ప్రశ్నించటం సరైంది కాదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

10/05/2016 - 08:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం లక్షిత దాడులతో ధ్వంసం చేసిన నేపథ్యంలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ అరూప్ రహా మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఎలాంటి సవాలు ఎదురైనా దాన్ని తిరుగులేని విధంగా తిప్పికొట్టేందుకు సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు.

10/05/2016 - 07:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ‘‘మాకు ఆరు నెలలు సమయమివ్వండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలు లేకుండా తుడిచిపెట్టేస్తాం. ఉగ్రమూకల వౌలిక నిర్మాణాలను నామరూపాలు లేకుండా చేస్తాం’’ అని భారత సైన్యం దేశ నాయకత్వానికి స్పష్టం చేసింది. సైనిక పదాతి దళాలకు చెందిన ఉన్నతస్థాయి ఇద్దరు మిలటరీ అధికారులు అనధికారికంగా ఈ విషయం వెల్లడించారు.

10/05/2016 - 08:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేసే విషయంలో కర్నాటకకు సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది. 7వ తేదీనుంచి 18వ తేదీ వరకు రోజుకు రెండువేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేయాలని మంగళవారం స్పష్టం చేసింది.

10/05/2016 - 07:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నటి, బిజెపి నాయకురాలు రూపా గంగూలీని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు నామినేట్ చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రూపా గంగూలీని నియమిస్తూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీచేశారు. 2015లో బిజెపిలో చేరిన రూపా గంగూలీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన విషయం విదితమే.

10/05/2016 - 05:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రావు బీరేంద్రసింగ్ తెలిపారు. ఆయన ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

10/05/2016 - 05:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పెరిగిపోతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని భారత్-సింగపూర్ దేశాలు నిర్ణయించాయి. పరస్పర వాణిజ్య, వ్యాపార లావాదేవీలను పెంచుకునేందుకు పలు ఒప్పందాలూ కుదుర్చుకున్నాయి. మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ సహా మొత్తం మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

10/05/2016 - 05:49

చెన్నై, అక్టోబర్ 4: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అన్నాడిఎంకె అధినేత్రి ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న గందరగోళానికి తెరదించాలని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. ఎఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం కోర్టుకు హాజరైన ప్రభుత్వ తరఫున్యాయవాది జయలలిత ఆరోగ్యానికి సంబంధించి సమాచారం అందించారు.

10/05/2016 - 01:42

భద్రాచలం/చింతూరు, అక్టోబర్ 4: , అక్టోబర్ 4: ఛత్తీష్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మంగళవారం భారీ సంఖ్యలో మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. 57మంది మావోయిస్టులు లొంగిపోగా, వీరిలో 17మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారు. బస్తర్ ఐజి ఎస్‌ఆర్‌కె కల్లూరి, సుకుమా కలెక్టర్, ఎస్పీల సమక్షంలో వీరంతా లొంగిపోయారు.

Pages