S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/04/2016 - 02:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలో పెద్దఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పగబట్టిన పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని ఇంటలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది.

10/04/2016 - 02:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ తదుపరి విచారణ అక్టోబరు 19కి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టుకి 2005నాటి పర్యావరణ అనుమతులు ఇప్పుడు చెల్లవని రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటి విచారించింది.

10/04/2016 - 02:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారత్‌పై ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తూ, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్‌లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నుంచి వైదొలగుతున్నట్టు భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. పంజాబ్‌లో జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆహ్వానించరాదని కబడ్డీ సమాఖ్య నిర్ణయించింది.

10/04/2016 - 00:55

శ్రీనగర్, అక్టోబర్ 3: జమ్మూ-కాశ్మీరులోని బారాముల్లాలో సైనిక శిబిరంపై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపినట్లుగా భావిస్తున్న దాడిపై గందగోళం నెలకొంది. ఈ దాడిలో బిఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు చెందిన ఒక జవాను మృతిచెందిన విషయం విదితమే. అయితే ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్రవాదులు వెంటనే అక్కడినుంచి పారిపోయి ఉంటారని పారా మిలటరీ అధికారులు చెబుతున్నారు.

10/04/2016 - 00:46

జమ్ము, అక్టోబర్ 3: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ దళాలు తమ దాడుల్ని మరింత ముమ్మరం చేశాయి. సోమవారం ఏకంగా నాలుగు సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనటు పాల్పడ్డాయి. పూంచ్ జిల్లాను ఆనుకుని ఉన్న సరిహద్దు పొడవునా ఉన్న సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఫిరంగి గుళ్లతో దాడులకు ఒడిగట్టాయి. అంతే తీవ్రతతో కాల్పులకూ పాల్పడ్డాయి.

10/04/2016 - 00:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: తమిళనాడుకు కావేరి జలాలను సెప్టెంబర్ 30న తామిచ్చిన ఆదేశాలను అమలు చేస్తారా, లేదా? అన్నది మంగళవారం మధ్యాహ్నం కల్లా నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరోవైపు కావేరి జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను సవరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మరో పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానంలో వేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.

10/04/2016 - 00:42

చెన్నై, అక్టోబర్ 3: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జయలలిత పరిస్థితిపై ఆమె ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు, కేబినెట్ మంత్రులతో సమావేశమైనట్లు చెప్తున్న ఫోటోలు విడుదల చేయాలని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.

10/04/2016 - 00:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన భారత్‌కు రష్యా బాసటగా నిలిచింది.

10/04/2016 - 00:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న డెంగ్యూ, చికున్ గునియాలపై అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు 25వేల రూపాయల జరిమానా విధించింది. వ్యాధుల నిర్మూలనలో నిర్లక్ష్యం చూపుతున్న అధికారుల పేర్లను ఇవ్వాల్సిందింగా సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆదేశించింది.

10/04/2016 - 00:37

గ్వాలియర్, అక్టోబర్ 3: పట్టణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యానికి సంబంధించిన వౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. పట్టణీకరణ ప్రక్రియ నిరంతరమైనదని ఇందులో భాగంగానే విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Pages