S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/03/2016 - 08:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ లక్షిత దాడులు జరిపినట్లు ప్రకటించిన తరువాత పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాడి తరువాత అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు స్వీయ రక్షణలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి తెగ ప్రయాస పడుతోంది.

10/03/2016 - 08:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: సీమాంతర ఉగ్రవాదానికి తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలని సార్క్ సభ్య దేశాలను నేపాల్ కోరింది. 19వ సార్క్ శిఖరాగ్ర సమావేశం వాయిదా పడినట్లు ఆదివారం ప్రకటించిన సందర్భంగా ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో నేపాల్ ఈ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగడానికి దక్షిణాసియా వాతావరణం అనుకూలంగా లేకపోవడం పట్ల ఆ దేశం విచారం వ్యక్తం చేసింది.

10/03/2016 - 08:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: పది పధ్నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లల సృజనకు ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ ఇతివృత్తంతో కూడిన స్టాంపులను తమ ఆలోచనలకు అనుగుణంగా ఈ పిల్లలు రూపొందించారు. ఇందుకు సంబంధించి జరిపిన జాతీయస్థాయి పోటీలో ఎంపికైన వారికి ప్రభుత్వం బహుమతులు ప్రకటించింది.

10/03/2016 - 08:05

బెంగళూరు, అక్టోబర్ 2:కావేరీ జలాల వివాదంలో తమ రాష్ట్రం బాధితురాలే తప్ప విలన్ కాదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్ఘాటించారు. ఉద్దేశపూర్వకంగానే తమిళనాడుకు తాము నీళ్లు ఇవ్వడం లేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా కర్నాటకను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నమూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరుగుతోందని అన్నారు.

10/03/2016 - 07:59

ఇస్లామాబాద్, అక్టోబర్ 2: ఇస్లామాబాద్‌లో వచ్చే నెలలో జరగవలసి ఉన్న సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశం రద్దు కావడంతో పాకిస్తాన్ అత్యవసరంగా ఆత్మావలోకనం చేసుకోవాలని, ఉగ్రవాదానికి, అసహనానికి నిలయమైన దేశంగా తనపై పడిన ముద్రను తొలగించుకునేందుకు శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని ‘ద డైలీ టైమ్స్’ అనే దినపత్రిక పాకిస్తాన్ ప్రభుత్వానికి సూచించింది.

10/03/2016 - 07:56

న్యూఢిల్లీ, అక్టోబరు 2: బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లు నిలవడం మంచి పరిణామం అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నాడు రెండు స్వచ్ఛ భారత్ స్మారక స్టాంపులను వెంకయ్యనాయుడు, కేంద్ర టెలికాం మంత్రి మనో జ్ సిన్హా విడుదల చేశారు. అనంతరం వెంకయ్య నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొన్న చర్చలు చాలా బాగున్నాయని చెప్పారు.

10/03/2016 - 07:38

న్యూఢిల్లీ,అక్టోబరు 2: తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి ఉదారంగా సాయం చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల రూ.2,202కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందజేసింది. త్వరలోనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందిస్తామని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

10/03/2016 - 07:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత్ ఏ దేశంపైనా దాడి చేయలేదని, ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న కాంక్ష భారత్‌కు లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్పష్టం చేశారు. కేవలం దేశం కోసమే కాకుండా ఇతరుల కోసం భారతీయులు ఎనలేని త్యాగాలు చేశారని ఆయన కొనియాడారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ తరచుగా కాశ్మీరు అంశాన్ని ప్రస్తావిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

10/03/2016 - 07:20

బారాముల్లా, అక్టోబర్ 2: కాశ్మీర్‌లోని బారాముల్లా సెక్టార్‌లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరంపై ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆత్మాహుతి దాడికి యత్నించారు. సమీపంలోని పబ్లిక్ పార్క్ ద్వారా రైఫిల్స్ శిబిరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. గ్రెనేడ్లు విసురుతూ దూసుకొస్తున్న ఉగ్రవాదులను తిప్పికొట్టేందుకు సైనికులు ఎదురుకాల్పులకు దిగారు.

10/03/2016 - 07:19

పోర్‌బందర్, అక్టోబర్ 2:్భరత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో తొమ్మిది మందితో కూడిన పాకిస్తాన్ బోట్‌ను గుజరాత్ తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం నౌకాదళం పట్టుకుంది. ఇందులో ఉన్న తొమ్మిది మందిని విచారణ నిమిత్తం పోర్‌బందర్‌కు తరలించారు.

Pages