S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/03/2016 - 07:17

చెన్నై, అక్టోబర్ 2:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, అయితే మరి కొన్ని రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని అపోలో ఆసుపత్రి ఆదివారం సాయంత్రం ఓ బులిటెన్ విడుదల చేసింది. జ్వరం, డిహైగ్రేషన్‌తో గత నెల 22న జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యంపై తీవ్ర స్థాయి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో లండన్‌కు చెందిన అంతర్జాతీయ నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బేలేను పిలిపించారు.

10/02/2016 - 03:38

భువనేశ్వర్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బిజెడి) ఇచ్చిన 12 గంటల బంద్‌తో శనివారం దక్షిణ ఒడిశాలోని ఏడు జిల్లాలో సాధారణ జనజీవనం స్తంభించింది. మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ, నబరంగ్‌పూర్, గంజాం, గజపతి, కందమాల్ జిల్లాల్లో బంద్ పాటించారు.

10/02/2016 - 03:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పర్యావరణంపై చరిత్రాత్మక పారిస్ ఒప్పందానికి భారత్ ఆదివారం గాంధీ జయంతి నాడు ఆమోదముద్ర వేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సైతం తన ఆమోదం తెలపడంతో ఈ ఒప్పందానికి మన దేశం ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ఒప్పందం అమలులోకి రావడానికి ప్రపంచంలోని పలు దేశాలతో పాటుగా మన దేశం కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

10/02/2016 - 02:34

భద్రాచలం, అక్టోబర్ 1: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేసి వారికి ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు యువకులను కాంకేర్ జిల్లాలో దారుణంగా హతమార్చారు.

10/02/2016 - 02:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో అపభుత్వం, దాని విభాగాల ఉదాసీనత, ఊగిసలాట ధోరణి, లేదా అసమర్థత కారణంగా న్యాయ వ్యవస్థపై పడుతున్న అనవసర భారం నుంచి దాన్ని విముక్తి చేయడానికి ఒక విధానాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ న్యాయ శాఖను కోరారు.

10/02/2016 - 01:29

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం లక్షిత దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆ దేశానికి ఏ ఒక్క దేశం నుంచీ మద్దతు లభించటం లేదు. భారత్ యుద్ధానికి దిగితే అణ్వస్త్రాలను ప్రయోగిస్తామంటూ పాక్ రక్షణమంత్రి దురహంకారంతో చేసిన ప్రకటనపై అమెరికా తీవ్రస్థాయిలో స్పందించింది. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయవద్దంటూ హెచ్చరించింది. అటు రష్యా కూడా భారత్‌కు బాసటగా నిలిచింది.

10/02/2016 - 01:24

చెన్నై, అక్టోబర్ 1: తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత ఆరోగ్యంపై శనివారం ఉదయం నుంచీ సందేహాస్పద వార్తలు వెల్లువెత్తడంతో రాష్టమ్రంతటా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

10/02/2016 - 01:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పాకిస్తాన్ ఇక మీదట ఎప్పుడు దుందుడుగా వ్యవహరించినా గట్టిగా బుద్ధి చెపుతామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హెచ్చరించారు. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక కమాండో దళాలు అక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదులు, వారికి రక్షణ కల్పిస్తున్న వారిని హతమార్చి వచ్చిన తరువాత మొదటిసారి మనోహర్ పారికర్ శనివారం విలేఖరులతో ముచ్చటించారు.

10/02/2016 - 01:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: చైనా తన తీరును మార్చుకోలేదు. ఉరీ ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ జరిపిన సర్జికల్ దాడులను యావత్ప్రపంచం సమర్థిస్తుంటే, చైనా మాత్రం పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులను రక్షించటం మాత్రం మానలేదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైష్ ఏ మహమ్మద్ నేత మసూద్ అజర్‌పై నిషేధం విధించాలన్న భారత ప్రతిపాదనకు చైనా మళ్లీ మోకాలడ్డింది.

10/02/2016 - 00:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరుకు రష్యా సంపూర్ణ మద్దతు తెలిపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయడానికి పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని రష్యా సూచించింది.

Pages