S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/02/2016 - 00:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఉరీలో 19మంది జవాన్ల మరణానికి కారణమైన దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ‘ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత దేశంగా మారిన పాకిస్తాన్’ తీరును తీవ్రస్థాయిలో ఖండించాలని బ్రిటన్ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 3875 సంతకాలతో విజ్ఞప్తులు అందాయని యూకే పార్లమెంట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

10/02/2016 - 00:56

ఉదంపూర్, అక్టోబర్ 1: జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టన పెట్టుకోవడం, దానికి ప్రతీకారంగా భారత సైన్యం నియంత్రణ రేఖకు ఆవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు జరిపిన నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత సైనిక దళాల ప్రధానాధికారి దల్బీర్ సింగ్ శనివారం జమ్మూ, కాశ్మీర్‌లో పర్యటించారు.

10/02/2016 - 00:47

బెంగళూరు, అక్టోబర్ 1: కావేరి జలాల విడుదల విషయంలో తమిళనాడుతో జరుగుతున్న వివాదంలో కర్ణాటకకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధినేత హెచ్‌డి దేవెగౌడ శనివారం ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయమైన విధాన సౌధ పక్కన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరాహారదీక్షకు కూర్చున్నారు.

10/02/2016 - 00:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వయోవృద్ధులకు సముచిత గౌరవం ఇవ్వాలని, వారికి వైద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పెద్దలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ ఒక కార్యక్రమంలో ఉద్ఘాటించారు. సమాజానికి వారు అందించన సేవలను గుర్తించాలన్నారు.

10/02/2016 - 00:30

జమ్మూ, అక్టోబర్ 1: పాకిస్తాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్మూకాశ్మీర్‌లోని అఖ్నూర్ తహసిల్ పరిధిలో ఎల్‌ఎసి వద్ద ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. భారత సైనిక శిబిరాలు, జనవాసాలే లక్ష్యంగా ఫిరంగులతో దాడులకు దిగాయి. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఉదయం 6 గంటల వరకూ పాక్ దాడులు సాగినట్టు తెలిసింది.

10/02/2016 - 00:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: నియంత్రణ రేఖ దాటి వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ లక్షిత దాడులు జరపడాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందువల్ల తాను రిటైరయ్యేలోగానే భారత్‌పై దాడికి దిగి ప్రతీకారం తీర్చుకోవచ్చని భావిస్తుండడం వల్లనే భారత ప్రభుత్వం సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉందని నిపుణులు అంటున్నారు. రహీల్ నవంబర్‌లో రిటైర్ కావలసి ఉంది.

10/02/2016 - 00:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పాకిస్తాన్‌తో యుద్ధాన్ని నివారించాలంటే చర్చల పరిష్కారం చర్చల ద్వారా జరగాలని జమాత్ ఎ ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఉరీలో ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు. యుద్ధ నివారణకు భారత్ వీలైన అన్ని చర్యలనూ తీసుకోవాలని కోరుతున్నాం’ అని అన్నారు.

10/02/2016 - 00:27

శ్రీనగర్, అక్టోబర్ 1: జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరం పాక్ ఉగ్రవాదుల దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ బ్రిగేడియర్‌పై వేటు పడింది. సెప్టెంబర్ 18న పాక్ ముష్కరులు జరిపిన దాడిలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఉరీలోని బ్రిగేడియర్ కమాండర్ కె సోమశంకర్‌ను అక్కడి బదిలీ చేసినట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

10/01/2016 - 07:07

సౌత్ బ్లాక్‌లోని రక్షణ శాఖ కార్యాలయంలోని ‘వార్ రూం’ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తాజా పరిస్థితిని ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరవేస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం అధికారులు వార్ రూంలోని సైనికాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

10/01/2016 - 07:05

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం బడ్జెట్ కేటాయింపులతోనే విజయవంతం కాలేదని, బ్రిటిష్ వలస పాలకుల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టినట్టుగా స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ ‘స్వచ్ఛాగ్రహ’ ఉద్యమాన్ని చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు.

Pages